బాబు వెంట అన్ని సూట్‌కేసులు వెళ్లాయా? ఇటలీ జనం అలా అన్నారా..!

చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీనేత అంబటిరాంబాబు మండిపడ్డారు. మోదీ కంటే ఎక్కువ పర్యటనలు చేస్తూ చంద్రబాబు దేశంలోనే అత్యంత విలాసవంతమైన ముఖ్యమంత్రిగా మారారని విమర్శించారు. ఇప్పటి వరకు అనేక దేశాలు తిరిగిన చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి పెట్టుబడులు తెచ్చారేమో చెప్పాలని డిమాండ్ చేశారు.ఏపీని చంద్రబాబు ఒకదేశంగా భావిస్తున్నట్టుగా ఉందన్నారు. అందుకే నేరుగా చైనాతో ఏపీ ఒప్పందాలు అంటూ గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెళ్తున్న ప్రత్యేక విమానంలో భారీగా సూట్‌కేసులు తీసుకెళ్తున్నారని అంబటి ఆరోపించారు. […]

Advertisement
Update: 2016-06-27 07:37 GMT

చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీనేత అంబటిరాంబాబు మండిపడ్డారు. మోదీ కంటే ఎక్కువ పర్యటనలు చేస్తూ చంద్రబాబు దేశంలోనే అత్యంత విలాసవంతమైన ముఖ్యమంత్రిగా మారారని విమర్శించారు. ఇప్పటి వరకు అనేక దేశాలు తిరిగిన చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి పెట్టుబడులు తెచ్చారేమో చెప్పాలని డిమాండ్ చేశారు.ఏపీని చంద్రబాబు ఒకదేశంగా భావిస్తున్నట్టుగా ఉందన్నారు. అందుకే నేరుగా చైనాతో ఏపీ ఒప్పందాలు అంటూ గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు వెళ్తున్న ప్రత్యేక విమానంలో భారీగా సూట్‌కేసులు తీసుకెళ్తున్నారని అంబటి ఆరోపించారు. మూడు నాలుగు రోజుల పర్యటనకు ఈ స్థాయిలో సూట్‌కేసులు తీసుకెళ్లిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. ఆ సూట్‌కేసుల్లో ఏముందో తేల్చాలన్నారు. చంద్రబాబు పర్యటనపై కేంద్ర ప్రభుత్వం కూడా నిఘా ఉంచాలని లేనిపక్షంలో దేశానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. పెట్టుబడులు తెస్తానంటూ ఇక్కడ సంపాదించిన సొమ్మును చంద్రబాబు విదేశాలకు తరలిస్తున్నట్టుగా తమకు అనుమానం ఉందన్నారు. చంద్రబాబు తన స్వార్థంతో రాష్ట్రాన్ని, అమరావతిని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో నెంబర్ వన్ కూలీని అని చెప్పుకునే చంద్రబాబు తనకుటుంబాన్ని తీసుకెళ్లి ఫైవ్ స్టార్‌ హోటల్‌లో పెట్టారని అంబటి విమర్శించారు. తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతంలోకి మీడియా వెళ్లకుండా ఎందుకు నిషేధం విధించారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణ ప్రాంతం పబ్లిక్‌ ప్లేస్ కాదా అని నిలదీశారు. 2004కు ముందు కూడా ఇటలీ వెళ్లిన చంద్రబాబు అక్కడి ప్రజలు తనను భారత ప్రధానిగా చూడాలనుకుంటున్నారంటూ గొప్పలు చెప్పుకున్నారని అంబటి గుర్తు చేశారు. తీరా చూస్తే 2004 ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూడా పనికి రారని తేల్చేశారని చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News