స్విస్‌ చాలెంజ్ తో తెరపైకి బ్రహ్మణి

చంద్రబాబు అనుకున్నంత పనిచేసేశారు. రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకే కట్టబెట్టేందుకు చంద్రబాబు ఎందుకు పాకులాడుతున్నారన్న దానికి సమాధానాలు దొరుకుతున్నాయి. స్విస్ చాలెంజ్లో రాజధాని నిర్మాణ బాధ్యతలను సింగపూర్‌కు చెందిన అసెండాస్- సింగ్ బ్రిడ్జి, సెంబ్ కార్ప్‌ సంస్థలకు చంద్రబాబు కట్టబెట్టారు. విచిత్రంగా ప్రభుత్వ వాటాను 42 శాతానికి పరిమితంచేసి సింగపూర్ కంపెనీకి సింహాభాగం 58శాతం కట్ట‌బెట్టారు. అయితే ఈ కంపెనీల్లో కీలక భాగస్వామిగా ఉన్న మరో కంపెనీ వెర్టెక్స్ వెంచర్స్‌. ఈ వెర్టెక్స్‌ కంపెపీలో చంద్రబాబు కోడలు […]

Advertisement
Update: 2016-06-25 00:38 GMT

చంద్రబాబు అనుకున్నంత పనిచేసేశారు. రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకే కట్టబెట్టేందుకు చంద్రబాబు ఎందుకు పాకులాడుతున్నారన్న దానికి సమాధానాలు దొరుకుతున్నాయి. స్విస్ చాలెంజ్లో రాజధాని నిర్మాణ బాధ్యతలను సింగపూర్‌కు చెందిన అసెండాస్- సింగ్ బ్రిడ్జి, సెంబ్ కార్ప్‌ సంస్థలకు చంద్రబాబు కట్టబెట్టారు. విచిత్రంగా ప్రభుత్వ వాటాను 42 శాతానికి పరిమితంచేసి సింగపూర్ కంపెనీకి సింహాభాగం 58శాతం కట్ట‌బెట్టారు. అయితే ఈ కంపెనీల్లో కీలక భాగస్వామిగా ఉన్న మరో కంపెనీ వెర్టెక్స్ వెంచర్స్‌. ఈ వెర్టెక్స్‌ కంపెపీలో చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి రెండేళ్ల పాటు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ విషయాన్ని కంపెనీలు అధికారికంగానే ధృవీకరిస్తున్నాయి.(దీనికి సంబంధించిన పత్రాల స్క్రీన్ షాట్లు కింద జతపరుస్తున్నాం). ఈ కంపెనీలో నారావారికి భారీగా షేర్ కూడా ఉందని చెబుతున్నారు.

పేరుకు సింగపూర్‌ కంపెనీలు అసెండాస్- సింగ్ బ్రిడ్జి, సెంబ్ కార్ప్‌ తెరపై కనిపించినా తెరవెనుక పనులన్నీ వెర్టెక్స్ కంపెనీవేన‌ని తెలుస్తోంది. ఈ వెర్టెక్స్‌కు చంద్రబాబుతో అనుబంధం ఈనాటికి కాదట. చంద్రబాబు హైటెక్‌ సిటీ కట్టడానికి ముందుగానే అక్కడి చుట్టుపక్కల వెర్టెక్స్ భారీగా భూములు కూడా కొనుగోలు చేసిందని చెబుతున్నారు. ప్రస్తుతం హైటెక్స్ సిటీ ప్రాంతంలో ఈ కంపెనీ భవనాలు కూడా చాలా కనిపిస్తాయి. హైటెక్ సిటీలో భూములకు గిరాకీ రాబోతోందన్న విషయాన్ని వెర్టెక్స్ ముందే పసిగట్టిందంటే దాని వెనుక ఎవరున్నారో ఇట్టే అర్థమవుతుంది.

అసెండాస్- సింగ్ బ్రిడ్జి, సెంబ్ కార్ప్‌కంపెనీలలో టెమాసెక్ హోల్డింగ్స్‌ అనే మరో సంస్థకు మేజారిటీ షేర్ ఉంది. ఈ కంపెనీ ఇప్పటికే హైదరాబాద్‌లో అనేక వ్యాపారకార్యకలాపాలు నిర్వహిస్తోంది. రాజధాని నిర్మాణ బాధ్యతలు కొట్టేసిన సింగపూర్ కంపెనీతో విచిత్రంగా టెమాసెక్ హోల్డింగ్స్ గత ఏడాది జూన్‌లో భాగస్వామిగా చేరింది. ఈ మొత్తం వ్యవహారాలను గమనించిన వారు… అసెండాస్- సింగ్ బ్రిడ్జి, సెంబ్ కార్ప్‌ సంస్థలు పేరుకే పైకి కనిస్తున్నట్టుగా భావిస్తున్నారు. ఈ రెండు కంపెనీల మాటున రాజధాని కాంట్రాక్టులు, లాభాలు, హక్కులు అన్నీ కూడా వెర్టెక్స్ వెంచర్స్, టెమాసెక్ హోల్డింగ్స్ చేజెక్కించుకోనున్నాయని అంచనా వేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా చివరకు రాజధాని లాభాల పంట నారావారి ఇంటికే చేరుతుందని భావిస్తున్నారు. మొత్తం మీద సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు కుటుంబానికి లింకులున్నాయన్న విషయం అధికారికంగానే స్పష్టమవుతోంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News