రైతులకు ఉచిత విద్యుత్‌ వద్దు... బాబు సీమ ద్రోహి

ఉచిత పథకాలపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉచితపథకాలు అభివృద్ధికి నిరోధకంగా మారుతున్నాయని విమర్శించారు. రుపాయికి కిలో బియ్యం, ఉచిత విద్యుత్‌ వద్దని తాను సీఎంకు పలుమార్లు సూచించానన్నారు. ప్రతి వ్యక్తి రోజుకు రూ. 200 దుబారా చేస్తున్నారని అలాంటి వారికి రూపాయి కిలో బియ్యం అవసరమా అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్‌ ఎత్తివేస్తే రైతులకు మరో విధంగా సబ్సిడీలు ఇవ్వొచ్చన్నారు. ముద్రగడ పురుగుల మందు డబ్బాతో బెదిరించడం, ప్రజలను […]

Advertisement
Update: 2016-06-12 21:20 GMT

ఉచిత పథకాలపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉచితపథకాలు అభివృద్ధికి నిరోధకంగా మారుతున్నాయని విమర్శించారు. రుపాయికి కిలో బియ్యం, ఉచిత విద్యుత్‌ వద్దని తాను సీఎంకు పలుమార్లు సూచించానన్నారు. ప్రతి వ్యక్తి రోజుకు రూ. 200 దుబారా చేస్తున్నారని అలాంటి వారికి రూపాయి కిలో బియ్యం అవసరమా అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్‌ ఎత్తివేస్తే రైతులకు మరో విధంగా సబ్సిడీలు ఇవ్వొచ్చన్నారు. ముద్రగడ పురుగుల మందు డబ్బాతో బెదిరించడం, ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని జేసీ అన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సీమ ద్రోహిగా తయారయ్యాడని మండిపడ్డారు. అసలు ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అనర్హుడని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు చరిత్రలో ఎవరూ చేయని విధంగా చంద్రబాబు నష్టం చేస్తున్నారని విమర్శించారు. సీమలో పుట్టి కూడా రాజధాని విషయంలో ఈ ప్రాంతప్రజల గొంతుకోశారన్నారు. చంద్రబాబుకు అమరావతి తప్ప మరేమీ కనిపించడం లేదన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News