సాక్షిపై వేటు " కాపుల్లో సానుభూతి పెంచిందా?

ముద్రగడ దీక్ష సందర్భంగా సాక్షి ప్రసారాలపై వేటు వేయడం ద్వారా ప్రభుత్వం తప్పు చేసిందన్న భావనను కొందరు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాపుల కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ వార్తలను ప్రసారం చేస్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అందుకే సాక్షిని నియంత్రించామని మంత్రులు గంటా, చినరాజప్ప స్వయంగా చెప్పారు. అయితే సాక్షి ప్రసారాలను నిలివేయడం ద్వారా కాపుల్లో సాక్షిపై, జగన్‌ పార్టీపై అనుకూలత పెంచినట్టు అయిందన్న భావన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. […]

Advertisement
Update: 2016-06-10 10:17 GMT

ముద్రగడ దీక్ష సందర్భంగా సాక్షి ప్రసారాలపై వేటు వేయడం ద్వారా ప్రభుత్వం తప్పు చేసిందన్న భావనను కొందరు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాపుల కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ వార్తలను ప్రసారం చేస్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అందుకే సాక్షిని నియంత్రించామని మంత్రులు గంటా, చినరాజప్ప స్వయంగా చెప్పారు. అయితే సాక్షి ప్రసారాలను నిలివేయడం ద్వారా కాపుల్లో సాక్షిపై, జగన్‌ పార్టీపై అనుకూలత పెంచినట్టు అయిందన్న భావన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే..

ముద్రగడ దీక్ష సమయంలో కిర్లంపూడిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని రాష్ట్రంలోని కాపులంతా ఆసక్తి చూపారు. కానీ టీవీ ఛానళ్లు అన్ని చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించని రీతిలోనే ముద్రగడ దీక్ష వార్తలను ఇచ్చాయి. ఎందుకంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానే తెలుగు టీవీఛానళ్లు అన్ని చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తుండడమే అందుకు కారణం. దీంతో సదరు టీవీ ఛానళ్లపై కాపులకు నమ్మకం తగ్గడమే కాకుండా తన నేత ముద్రగడను అణచివేసేందుకు చంద్రబాబు మీడియాను కూడా వాడుకుంటున్నారన్న భావన వారిలో వ్యక్తమైంది. ఈ సమయంలో కిర్లంపూడిలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కాపులు సాక్షి టీవీ వైపు మళ్లారు. కానీ అంతలోనే సాక్షి ప్రసారాలను టీడీపీ ప్రభుత్వం నిలిపివేయించింది. ఈ చర్య కాపుల్లో చంద్రబాబుపై మరింత అసహనాన్ని పెంచింది.

ముద్రగడ దీక్ష గురించి తమకు తెలుసుకునే అవకాశం కూడా లేకుండా చంద్రబాబు కక్ష కట్టారన్న అభిప్రాయం సగటు కాపుల్లో వ్యక్తమైంది. అంటే భవిష్యత్తులో కాపుల హక్కుల కోసం చేసే పోరాటాన్ని అసలు బయటి ప్రపంచానికి వినిపించకుండా, కనిపించకుండా చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారన్న ఆగ్రహం వారిలో వ్యక్తమైంది. మొత్తం మీద ప్రభుత్వ చర్యల ద్వారా టీడీపీని వ్యతిరేకించే కాపుల సంఖ్య మరింత పెరిగిందనే చెప్పాలి. . ఒక విధంగా ముద్రగడ పోరాటాన్ని సమర్థిస్తున్న కాపులంతా తమ కోసం సాక్షి టీవీ దెబ్బలు తిన్నదన్న భావనకు వచ్చారు. మిగిలిన టీవీ ఛానళ్లన్నీ బాబు కోసం పనిచేస్తాయే గానీ, తమ కోసంగానీ ప్రజల కోసం గానీ కాదని కాపులు ఒక నిర్ధారణకు వచ్చే ఉండాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News