యనమల జోకులకు జనం నోటితో నవ్వడం లేదు

అవిశ్వాసం సమయంలో అసెంబ్లీలో ఇష్టానుసారం నిబంధనలను రద్దు చేసినా తనను, తన బాసు చంద్రబాబును దేశంలోని ఏ వ్యవస్థ ఏమీ చేయలేకపోయే సరికి యనమల రామకృష్ణుడికి అహంకారం అమాంతం పెరిగినట్టుగా ఉంది. ఇప్పుడు ఏకంగా కోర్టులు చేసే పనిని కూడా తామే చేస్తామని ప్రకటించుకున్నారు. కాకినాడలో మాట్లాడిన యనమల రామకృష్ణుడు … జగన్‌కు చెందిన సాక్షి పత్రిక, టీవీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియ మొదలవుతుందన్నారు. అవినీతి కేసుల్లో రాష్ఠ్రానికి […]

Advertisement
Update: 2016-06-08 21:00 GMT

అవిశ్వాసం సమయంలో అసెంబ్లీలో ఇష్టానుసారం నిబంధనలను రద్దు చేసినా తనను, తన బాసు చంద్రబాబును దేశంలోని ఏ వ్యవస్థ ఏమీ చేయలేకపోయే సరికి యనమల రామకృష్ణుడికి అహంకారం అమాంతం పెరిగినట్టుగా ఉంది. ఇప్పుడు ఏకంగా కోర్టులు చేసే పనిని కూడా తామే చేస్తామని ప్రకటించుకున్నారు. కాకినాడలో మాట్లాడిన యనమల రామకృష్ణుడు … జగన్‌కు చెందిన సాక్షి పత్రిక, టీవీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియ మొదలవుతుందన్నారు. అవినీతి కేసుల్లో రాష్ఠ్రానికి చెందిన వ్యక్తులు, సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకునేలా ఏపీ ఇటీవల కొత్త చట్టం తెచ్చిందని చెప్పారు. . ఆ చట్టం సాయంతోనే సాక్షి మీడియాను ప్రభుత్వపరం చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే…

యనమల వ్యాఖ్యలు చూస్తే ఆయనకు, ఆయన బాస్ చంద్రబాబుకు రాజ్యంగం,కోర్టులు వంటివ్యవస్థల మీద ఎంత చిన్నచూపు ఉందో అర్థమవుతోంది. తాను వేసే కుళ్లు జోకులను అచ్చేయడానికి పత్రికలు, చూపించడానికి చానళ్లు ఉన్నాయన్న ధీమాతో సాక్షి ఆస్తులుస్వాధీనం చేసుకుంటామంటూ నాలుగురోజులకొకసారి యనమల కామెడీ చేస్తున్నారు. ఈ దేశంలో శిక్షలు వేసే అధికారం కోర్టులకు మాత్రమే ఉంటుంది. జగన్ ఆస్తులు అక్రమమా సక్రమమా అన్నది కోర్టులే తేల్చాలి. రాజ్యంగం కూడా అదే చెబుతోంది. యనమల చెప్పినట్టు చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు కలిసి సొంతచట్టాలు చేసుకుని వాటి ద్వారా తమకు నచ్చని వారిని శిక్షిస్తామనడానికి ఇదేమీ హింసించే 23వ రాజు పులకేశి రాజ్యం కాదు.

యనమల చెబుతున్న పోకడలు నియంతల రాజ్యంలో చెల్లుతాయేమో గానీ, భారతదేశంలో కాదు. చంద్రబాబు ఒక రాజ్యానికి రాజు అయినట్టు ఆయన దగ్గర యనమల మంత్రి అయినట్టు … నోటి తీర్పులతో శిక్షలు వేయాలంటే వీలుకాదు. జగన్ ప్రస్తుతానికి నిందితుడు మాత్రమే… దోషి కాదు. నిందితుల ఆస్తులనుస్వాధీనం చేసుకునే చట్టాలు ప్రపంచంలోనే ఎక్కడా లేవు. బహుషా ప్రపంచానికి కంప్యూటర్లు పరిచయం చేసిన మేధావి చంద్రబాబే ఇలాంటి చట్టాలను కూడా ప్రపంచానికి పరిచయం చేస్తారేమో!. అసెంబ్లీలో మేజారిటీ ఉన్న ప్రతోడు సొంతచట్టం చేసుకుని శిక్షలు వేస్తామంటే నడవదు. సాక్షి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని తాను చేసే వ్యాఖ్యలు చూసి మేధావులు నవ్వుకుంటారన్న ఇంగితం కూడా లేని సోకాల్డ్‌ మేధాని యనమల గారూ…. మరోసారి ఇలాంటి జోకులు వేయకండి. . జనం నోటితో నవ్వడం మానేసి…….!

Click on Image to Read:

Advertisement

Similar News