"నీ ఇలాకాలో... నా తడాఖా" అట

ఆంధ్రప్రదేశ్‌ మీడియా వెర్రిపోకడల వైపు పరుగులు తీస్తోంది. ప్రాంతాల మధ్య విధ్వేషాలు తగ్గించేందుకు ప్రయత్నించాల్సిన మీడియా… కుల, ప్రాంతాల చిచ్చుకు తన వంతుగా ఆజ్యం పోస్తోంది. బుధవారం కడపలో జరిగిన చంద్రబాబు సంకల్పదీక్ష సందర్భంగా చంద్రబాబు అనుకూల టీవీ ఛానల్ చేసిన ప్రయోగం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు సంకల్పం తీసుకున్నారని ఉదయం నుంచి ఊదరగొట్టిన సదరు టీవీ ఛానల్‌… తీరా సంకల్ప దీక్ష సమయంలో అసలు అభిమానాన్ని బయట పెట్టుకుంది. చంద్రబాబు […]

Advertisement
Update: 2016-06-08 10:02 GMT

ఆంధ్రప్రదేశ్‌ మీడియా వెర్రిపోకడల వైపు పరుగులు తీస్తోంది. ప్రాంతాల మధ్య విధ్వేషాలు తగ్గించేందుకు ప్రయత్నించాల్సిన మీడియా… కుల, ప్రాంతాల చిచ్చుకు తన వంతుగా ఆజ్యం పోస్తోంది. బుధవారం కడపలో జరిగిన చంద్రబాబు సంకల్పదీక్ష సందర్భంగా చంద్రబాబు అనుకూల టీవీ ఛానల్ చేసిన ప్రయోగం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు సంకల్పం తీసుకున్నారని ఉదయం నుంచి ఊదరగొట్టిన సదరు టీవీ ఛానల్‌… తీరా సంకల్ప దీక్ష సమయంలో అసలు అభిమానాన్ని బయట పెట్టుకుంది.

చంద్రబాబు పవిత్రమైనదిగా చెప్పుకునే సంకల్పదీక్ష సభకు సదరు టీవీ ఛానల్‌ పెట్టిన ఓటీఎస్ ట్యాగ్ ”నీ ఇలాకాలో … నా తడాఖా”. టైటిల్‌ పక్కన చంద్రబాబు, జగన్ ఫొటోలను పెట్టింది. ఈ టైటిల్ చూస్తేనే చాలు కడపలో చంద్రబాబు సభ ఎందుకు పెట్టారన్నది ఇట్టే అర్థమైపోతోంది. చంద్రబాబు రాజకీయ నాయకుడు కాబట్టి తప్పుపట్టలేం. కానీ బాబు అనుకూల టీవీ ఛానల్‌ పెట్టిన ట్యాగ్ చూస్తే … కడప మీదకు చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన అనుచరగణం దండెత్తి వచ్చిందా అన్న అనుమానం కలుగుతుంది. ”నీ ఇలాకాలో నా తడాఖా” అని అంటున్నారు. చంద్రబాబు ఏమైనా కడప జిల్లాలో 10 స్థానాలకు కనీసం రెండు స్థానాలైనా గెలిచారా?. లేక పార్టీ ఫిరాయించిన ఆదినారాయణరెడ్డితో రాజీనామా చేయించి తిరిగి సైకిల్ గుర్తుపై గెలిపించుకున్నారా?. లేదే!. మరి జగన్ ఇలాకాలో చంద్రబాబు ఏం తడాఖా చూపించారో… అది సదరు టీవీ ఛానల్‌కు మాత్రమే ఎలా కనిపించిందో!.

ఎన్నడూ లేని విధంగా ఏడు వేలమంది పోలీసులను, 15 మంది ఐపీఎస్‌లు, 400 సీసీ కెమెరాలను వెంటేసుకుని కడపలో సభ నిర్వహించడం ద్వారా చంద్రబాబు తడాఖా చూపించారన్నది సదరు టీవీ ఛానల్ ఉద్దేశం కాబోలు. కడప అన్నది సదరు ఛానల్ దృష్టిలో ఉగ్రవాద ప్రాంతమా?. అక్కడికి వెళ్లి సభ నిర్వహిస్తే చాలు తడాఖా చూపించినట్టు అవుతుందా?. వాట్‌ ఏ పిటి. తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు పేట్రేగడానికి రాజకీయనాయకులతో పాటు సినిమా, మీడియా వర్గాలు కూడా కారణం అన్న ఆరోపణ ఇలాంటి ఘటనలతో నిజమే అనుకోవాల్సి వస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News