మేమూ మనుషులమే- ప్లకార్డులతో ఏపీ సచివాలయ ఉద్యోగుల ర్యాలీ

జూన్ 27 నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ అమరావతి వెళ్లాల్సిందేనంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశించడంపై ఏపీ సచివాలయ ఉద్యోగులు భగ్గుమన్నారు. మేం మనుషులం… వస్తువులం కాదు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉద్యోగులు హైదరాబాద్ సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎస్ ఠక్కర్‌ను కలిసి తమ అభ్యంతరాలు తెలియజేశారు. కనీస సౌకర్యాలు లేని చోటికి వెళ్లి ఎలా పనిచేయాలని ఉద్యోగులు ఠక్కర్‌ను నిలదీశారు. ఇంటి అద్దెలు భారీగా పెంచేశారని… కార్పొరేట్ కాలేజీల ఫీజులు కూడా భారీగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. […]

Advertisement
Update: 2016-06-03 06:22 GMT

జూన్ 27 నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ అమరావతి వెళ్లాల్సిందేనంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశించడంపై ఏపీ సచివాలయ ఉద్యోగులు భగ్గుమన్నారు. మేం మనుషులం… వస్తువులం కాదు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉద్యోగులు హైదరాబాద్ సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎస్ ఠక్కర్‌ను కలిసి తమ అభ్యంతరాలు తెలియజేశారు. కనీస సౌకర్యాలు లేని చోటికి వెళ్లి ఎలా పనిచేయాలని ఉద్యోగులు ఠక్కర్‌ను నిలదీశారు. ఇంటి అద్దెలు భారీగా పెంచేశారని… కార్పొరేట్ కాలేజీల ఫీజులు కూడా భారీగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నగర శివారులో తాము బతకలేమని చెప్పారు. ఉద్యోగుల తరలింపును రెండు విడతల్లో చేయాలని కోరారు. అసలు ఆఫీసులు లేని చోటికి తామెళ్లి ఏం చేయాలని ప్రశ్నించారు. దీంతో స్పందించిన సీఎస్ జూన్ 27నాటికి హెచ్‌ఓడీలు మాత్రమే వెళ్తారని ఆఫీసులు సిద్ధమైన తర్వాత ఉద్యోగుల తరలింపు ఉంటుందని చెప్పారు. దీంతో ఉద్యోగులు మరింత తికమకకు గురయ్యారు. ఉద్యోగుల తరలింపు ఎప్పుడన్న దానిపై స్పష్టత ఇవ్వకపోతే తమ పిల్లలను ఈ ఏడాది హైదరాబాద్‌లో చేర్పించాలా లేక విజయవాడలో చేర్పించాలా అన్నది ఎలా తేల్చుకోవాలని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో ఉద్యోగుల కోసం హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగుల ఆందోళనలో ఉద్యోగ సంఘాల నాయకులు నాయకత్వం వహించకపోవడం గమనార్హం. ఉద్యోగ సంఘాల నేతలు సరిగా స్పందించడం లేదన్న అసంతృప్తితో నేరుగా ఉద్యోగులంతా సమిష్టిగా సీఎస్ దగ్గరకు వెళ్లారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు ఉద్యోగులు అమరావతిలో పర్యటించి అంతా బాగుందని మీడియాతో చెప్పడంపైనా సగటు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News