మహేష్, పవన్ కంటే ప్రభాస్ గొప్ప...

టాలీవుడ్ లో ప్రభాస్ పేరు టాప్-5లో ఎక్కడో ఉంటుంది. అతడు కచ్చితంగా స్టార్ హీరోనే. అందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ రికార్డు హిట్స్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఆధారంగా చూసుకుంటే… కచ్చితంగా పవన్, మహేష్ కంటే ముందు అయితే మాత్రం ప్రభాస్ ఉండడు. కానీ ఈ లెక్కలన్నీ ఇక్కడివరకే పరిమితం. బాలీవుడ్ కు వెళ్తే మాత్రం అక్కడ ప్రభాసే స్టార్ హీరో. బాలీవుడ్ మీడియాకు, అక్కడి ప్రజలకు టాలీవుడ్ నుంచి నంబర్ వన్ హీరో ప్రభాస్ […]

Advertisement
Update: 2016-05-30 23:04 GMT

టాలీవుడ్ లో ప్రభాస్ పేరు టాప్-5లో ఎక్కడో ఉంటుంది. అతడు కచ్చితంగా స్టార్ హీరోనే. అందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ రికార్డు హిట్స్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఆధారంగా చూసుకుంటే… కచ్చితంగా పవన్, మహేష్ కంటే ముందు అయితే మాత్రం ప్రభాస్ ఉండడు. కానీ ఈ లెక్కలన్నీ ఇక్కడివరకే పరిమితం. బాలీవుడ్ కు వెళ్తే మాత్రం అక్కడ ప్రభాసే స్టార్ హీరో. బాలీవుడ్ మీడియాకు, అక్కడి ప్రజలకు టాలీవుడ్ నుంచి నంబర్ వన్ హీరో ప్రభాస్ మాత్రమే. తాజాగా ఓ సౌతిండియా వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఉత్తరాది జనాలకు టాలీవుడ్ నుంచి పవన్, మహేష్ కంటే ప్రభాసే బాగా తెలుసు. దానికి కారణం బాహుబలి సినిమా. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా… ఉత్తరాదిన చిన్నచిన్న జిల్లాకేంద్రాల్లో కూడా విడుదలైంది. విడుదలైన ప్రతి చోటా ఈ సిినిమాకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఉత్తరాదిన చాలామంది ప్రేక్షకులు ప్రభాస్ ను గుర్తుపడతారు. అదే సమయంలో… బాహుబలి రేంజ్ లో మహేష్, పవన్ నటించిన సినిమాలేవీ ఉత్తరాదిన ఆడలేకపోయాయి. అందుకే…. బాలీవుడ్ లో మహేష్, పవన్ కంటే ప్రభాసే స్టార్ హీరో అంటున్నారు జనాలు.

Tags:    
Advertisement

Similar News