జీహెచ్ఎంసీ ఎన్నికలే నిదర్శనం... అండమాన్‌లోనూ గెలుస్తాం- లోకేష్

తిరుపతి మహానాడులో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రసంగించారు. అచ్చం తండ్రి తరహాలోనే మాట్లాడారు. తన తండ్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల కోసం ఆరునెలలు బస్సులోనే పడుకుని, బస్సులోనే భోజనం చేస్తూ పాలన సాగించిన నాయకుడు చంద్రబాబునాయుడు అని అన్నారు. మనవడిని చూడాలని ఉన్నా ప్రజల కోసం త్యాగం చేసి అమరావతిలో ఉంటున్నారని ప్రశంసించారు. ఇలాంటి నాయకుడు దొరకడం ప్రజల అదృష్టమన్నారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా 25వేల కోట్ల రైతు రుణమాఫీ […]

Advertisement
Update: 2016-05-29 00:56 GMT

తిరుపతి మహానాడులో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రసంగించారు. అచ్చం తండ్రి తరహాలోనే మాట్లాడారు. తన తండ్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల కోసం ఆరునెలలు బస్సులోనే పడుకుని, బస్సులోనే భోజనం చేస్తూ పాలన సాగించిన నాయకుడు చంద్రబాబునాయుడు అని అన్నారు. మనవడిని చూడాలని ఉన్నా ప్రజల కోసం త్యాగం చేసి అమరావతిలో ఉంటున్నారని ప్రశంసించారు. ఇలాంటి నాయకుడు దొరకడం ప్రజల అదృష్టమన్నారు.

16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా 25వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత టీడీపీదేనన్నారు. 10వేల కోట్లతో డ్వాక్రా మహిళలను ఆదుకున్నామని చెప్పారు. అయితే డ్వాక్రా మహిళలకు 10వేలకోట్లు ఇచ్చామని లోకేష్ చెప్పినప్పుడు సభ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. బహుశా ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.10వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పబోయి 10వేల కోట్లు ఇచ్చేశామని లోకేష్ అని ఉండవచ్చు. 24గంటల విద్యుత్ సరఫరా కూడా టీడీపీ ఘనతేనన్నారు.

తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని అందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలే నిదర్శనం అన్నారు. గ్రేటర్లో సీట్లు రాకపోయినా భారీగా ఓట్లు వచ్చాయని లోకేష్ చెప్పారు. టీడీపీ ఒక జాతీయ పార్టీ అని అన్నారు. త్వరలోనే పక్కరాష్ట్రాల్లోనూ పాగా వేస్తామన్నారు. ఇప్పటికే అండమాన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు సీట్లు కైవసం చేసుకున్నామని… అండమాన్ మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటామని లోకేష్ చెప్పారు.

టీడీపీని ఆంధ్రాపార్టీ అంటూ టీఆర్‌ఎస్ ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తోందని… కానీ టీడీపీ ఆవిర్భావమే తెలంగాణలో జరిగిందన్నవిషయం టీఆర్‌ఎస్ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. అమరావతిలో అరటితోటలను తగలబెట్టించింది వైసీపీ అని ఆరోపించారు. తుని ఘటన వెనుక కూడా వైసీపీ నేతల హస్తముందన్నారు. తాను ఇసుక నుంచి మజ్జిగ వరకు అన్నింటిలోనూ వాటాలు తీసుకుంటున్నానని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని … వాటిని నిరూపిస్తే స్వయంగా వెళ్లి జైల్లో కూర్చుంటానని సవాల్ చేశారు. రాయలసీమను రతనాల సీమగామార్చేందుకే రెండు నదులను చంద్రబాబునాయుడు అనుసంధానం చేశారని లోకేష్ వెల్లడించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News