రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి రూమర్లు

రజనీకాంత్ కు ఏమైంది…? ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించిందా…? ప్రస్తుతం సూపర్ స్టార్ పై ఈ పుకార్లు మరోసారి గుప్పమంటున్నాడు. అప్పట్లో కొచ్చడయాన్ సినిమా ప్రారంభమైన కొత్తలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు రజనీకాంత్. అయితే ఆ తర్వాత పూర్తిగా కోలుకొని తిరిగి సినిమాలో నటించారు. ఎంత ఆరోగ్యంతో ఉన్నారంటే…. ఈమధ్య ఒకేసారి రెండు సినిమాల్ని కంప్లీట్ చేసేంత ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో కబాలి సినిమా షూటింగ్ పూర్తయింది. జులై 2న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. […]

Advertisement
Update: 2016-05-27 23:25 GMT

రజనీకాంత్ కు ఏమైంది…? ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించిందా…? ప్రస్తుతం సూపర్ స్టార్ పై ఈ పుకార్లు మరోసారి గుప్పమంటున్నాడు. అప్పట్లో కొచ్చడయాన్ సినిమా ప్రారంభమైన కొత్తలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు రజనీకాంత్. అయితే ఆ తర్వాత పూర్తిగా కోలుకొని తిరిగి సినిమాలో నటించారు. ఎంత ఆరోగ్యంతో ఉన్నారంటే…. ఈమధ్య ఒకేసారి రెండు సినిమాల్ని కంప్లీట్ చేసేంత ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో కబాలి సినిమా షూటింగ్ పూర్తయింది. జులై 2న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరో సినిమా శంకర్ దర్శకత్వంలో వస్తున్న రోబో 2.0. ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి కనీసం ఈ ఏడాదంతా సమయం పడుతుంది. అయితే ఇంతలోనే రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలొచ్చాయి. రోబో 2.0 సినిమా షూటింగ్ ను సడెన్ గా ఆపేయడం… రజనీకాంత్ హుటాహుటిన అమెరికా వెళ్లడంతో ఈ పుకార్లు వ్యాపించాయి. అయితే రజనీ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, కేవలం విశ్రాంతి తీసుకోవడం కోసమే 2 వారాలు గ్యాప్ తీసుకున్నారని… సూపర్ స్టార్ సన్నిహితులు చెబుతున్నారు. రజనీకి ఏం కాకూడదని అప్పుడే తమిళనాట పూజలు కూడా షురూ అయ్యాయి.

Advertisement

Similar News