తండ్రి తరహాలోనే మహేష్ స్పందన

బ్రహ్మోత్సవం సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. నిర్మాణ సంస్థ కూడా ఇబ్బందులు పడింది. దీంతో నిర్మాణ సంస్థకు ధైర్యం ఇచ్చేందుకు మహేష్ ముందుకొచ్చాడు. ”బ్రహ్మోత్సవం” నిర్మించిన పీవీపీ బ్యానర్‌పై మరో సినిమా చేసేందుకు మాట ఇచ్చాడు. తన వల్ల పీవీపీ నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. గతంలో సూపర్ స్టార్ కృష్ట కూడా తన సినిమాల వల్ల నిర్మాతలకు నష్టం వస్తే మరో సినిమాకు అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు మహేష్ కూడా […]

Advertisement
Update: 2016-05-27 03:57 GMT

బ్రహ్మోత్సవం సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. నిర్మాణ సంస్థ కూడా ఇబ్బందులు పడింది. దీంతో నిర్మాణ సంస్థకు ధైర్యం ఇచ్చేందుకు మహేష్ ముందుకొచ్చాడు. ”బ్రహ్మోత్సవం” నిర్మించిన పీవీపీ బ్యానర్‌పై మరో సినిమా చేసేందుకు మాట ఇచ్చాడు. తన వల్ల పీవీపీ నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. గతంలో సూపర్ స్టార్ కృష్ట కూడా తన సినిమాల వల్ల నిర్మాతలకు నష్టం వస్తే మరో సినిమాకు అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు మహేష్ కూడా అదేదారిలో పయణిస్తున్నారు.

మహేష్ హామీ ఇవ్వడమే ఆలస్యం పీవీపీ నిర్మాణ సంస్థ కథ వేటలో పడింది. హిట్ మూవీ ఊపిరిని తీసిన వంశీ పైడిపల్లి దర్శకత్వంతో సినిమా ప్లాన్ చేసేందుకు సిద్ధమైంది. వంశీచెప్పిన స్టోరి లైన్ మహేష్‌కు కూడా నచ్చిందట. అయితే మహేష్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. పీవీపీ బ్యానర్‌పై నిర్మించే సినిమాను ముందుగా తెరపైకి తెస్తారా లేక పూరి చిత్రాన్ని కూడా పూర్తి చేసుకున్న తర్వాతే ”బ్రహ్మోత్సం” నిర్మాణ సంస్థను ఆదుకుంటారా అన్నది చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News