దెబ్బకు పీవీపీ కుదేలు

బ్రహ్మోత్సవం దెబ్బ మామూలుగా తగల్లేదు. మహేష్ భాషలోనే చెప్పలాంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇప్పుడీ దెబ్బకు ఏకంగా పీవీపీ నిర్మాణ సంస్థే ఆలోచనలో పడిందట. అసలు సినిమా రంగంలో ఉండాలా వద్దా అనే ఆలోచన చేస్తోందని సమాచారం. ఆ రేంజ్ లో బ్రహ్మోత్సవం దెబ్బ ఆ సంస్థను తాకింది. నిజానికి పీవీపీ సినిమాకు ప్రారంభంలో చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. భారీ బడ్జెట్ తో తీసిన వర్ణ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత […]

Advertisement
Update: 2016-05-24 22:51 GMT
బ్రహ్మోత్సవం దెబ్బ మామూలుగా తగల్లేదు. మహేష్ భాషలోనే చెప్పలాంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇప్పుడీ దెబ్బకు ఏకంగా పీవీపీ నిర్మాణ సంస్థే ఆలోచనలో పడిందట. అసలు సినిమా రంగంలో ఉండాలా వద్దా అనే ఆలోచన చేస్తోందని సమాచారం. ఆ రేంజ్ లో బ్రహ్మోత్సవం దెబ్బ ఆ సంస్థను తాకింది. నిజానికి పీవీపీ సినిమాకు ప్రారంభంలో చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. భారీ బడ్జెట్ తో తీసిన వర్ణ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత కూడా ఫ్లాపులు వచ్చినప్పటికీ…. సైజ్ జీరో, ఊపిరి, క్షణం లాంటి సినిమాలతో ఉత్తమాభిరుచి కలిగిన బ్యానర్ గా పీవీపీ తన పేరును సార్థకం చేసుకుంది. వీళ్ల బ్యానర్ నుంచి మంచి సినిమాలే వస్తాయనే అభిప్రాయం కలిగేలా చేసుకుంది. కానీ బ్రహ్మోత్సవం సినిమా ఇలా వచ్చి అలా మొత్తం పేరును ఊడ్చిపారేసింది. దేశ, విదేశాల్లో ఎన్నో వ్యాపారాలు చేసి తమకు తిరుగులేదని నిరూపించుకున్న పీవీపీ, ఈ సినిమా నష్టాలకు కుదేలైపోయాడట. అసలు నిర్మాణ రంగంలో కొనసాగాలా వద్దా అనే మీమాంసలో పడిపోడాయట. పవన్ కల్యాణ్ శరత్ మరార్ ను ఆదుకున్నట్టు… మహేష్ కూడా పీవీపీకి మరో ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో…

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News