చీప్ అల్లు పాలిటిక్స్ ఇప్పుడిది ట్రెండింగ్

మెగా హీరోల ఆడియో ఫంక్ష‌న్ ఏది జ‌రిగానా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు.. ఆయ‌న గురించి చెప్ప‌మంటూ ఇత‌ర మెగా హీరోల్ని అడుగుతుండ‌టం కామ‌న్ గా జ‌ర‌గుతుంటుంది. అయితే ఇది మిగిలిన వారికి ఎలా వున్న బ‌న్నీ కి పెద్ద‌గా న‌చ్చ‌న‌ట్లుంది. ఈ మ‌ధ్య స‌రైనోడు ఆడియో ఫంక్ష‌న్ లో ప‌వ‌న్ అభిమానులు.. బ‌న్నీ ని ప‌వ‌న్ గురించి చెప్ప‌మ‌ని అడిగితే.. చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అని స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ప‌వ‌న్ అభిమానులు సోష‌ల్ నెట్ […]

Advertisement
Update: 2016-05-19 00:22 GMT

మెగా హీరోల ఆడియో ఫంక్ష‌న్ ఏది జ‌రిగానా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు.. ఆయ‌న గురించి చెప్ప‌మంటూ ఇత‌ర మెగా హీరోల్ని అడుగుతుండ‌టం కామ‌న్ గా జ‌ర‌గుతుంటుంది. అయితే ఇది మిగిలిన వారికి ఎలా వున్న బ‌న్నీ కి పెద్ద‌గా న‌చ్చ‌న‌ట్లుంది. ఈ మ‌ధ్య స‌రైనోడు ఆడియో ఫంక్ష‌న్ లో ప‌వ‌న్ అభిమానులు.. బ‌న్నీ ని ప‌వ‌న్ గురించి చెప్ప‌మ‌ని అడిగితే.. చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అని స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ప‌వ‌న్ అభిమానులు సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో బ‌న్నీ పై ఒక రేంజ్ లో ఎటాక్ చేస్తున్నారు. మా దేవుడి గురించి అడిగితే చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అని స‌మాధానం ఇవ్వడాన్ని ప‌వ‌న్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అస‌లు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఈ వివాదం ఇలా ఉంటే…. అల్లు వారి హీరోకు మరో తలనొప్పి వచ్చి పడింది. ట్విట్టర్లో ‘చీప్ అల్లు పాలిటిక్స్’ పేరుతో మహేష్ ఫ్యాన్స్ ట్రెండింగ్ క్రియేట్ చేసారు. ఇది కూడా నేషనల్ లెవల్లో ట్రెండింగ్ అవుతోంది. బ్రహ్మోత్సవం సినిమాకు థియేటర్లు దక్కకుండా అల్లు అరవింద్ థియేటర్లు బ్లాక్ చేసారని, మహేష్ ఫ్యాన్స్ ఇలా రెచ్చిపోవడానికి కారణం ఇదే అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ‘చెప్పను బ్రదర్’ వివాదంతో బన్నీ చాలా డిస్ట్రబ్ అయ్యారు. ఇపుడు ‘చీప్ అల్లు పాలిటిక్స్’ వివాదంతో ఆయన మరింత గరం అయ్యారని టాక్. ఏదైనా వేదిక దొరికితే తగిన సమాధానం చెప్పాలని, తన పదునైన సమాధానంతో వాళ్ల దుమ్ము దులిపేయాలనేంత కోపంతో ఉన్నారట.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News