తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సూర్య

సూర్యపై ఈమధ్య కాలంలో ఎలాంటి వివాదాలు చెలరేగలేదు. పోనీ తాజా చిత్రం 24 ఏమైనా అట్టర్ ఫ్లాప్ అయిందా అంటే అది కూడా జరగలేదు. తెలుగుతో పాటు తమిళనాట ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతోంది. పోనీ సూర్య ఎవరితోనైనా దురుసుగా ప్రవర్తించాడా అంటే అది కూడా లేదు. ఇవేవీ రీజన్స్ కానప్పటికీ సూర్య తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. తనను క్షమించండి అంటూ పబ్లిక్ గా ఉత్తరం రాశాడు. సూర్య ఇలా బహిరంగంగా క్షమాపణలు కోరడానికి బలమైన […]

Advertisement
Update: 2016-05-18 02:04 GMT
సూర్యపై ఈమధ్య కాలంలో ఎలాంటి వివాదాలు చెలరేగలేదు. పోనీ తాజా చిత్రం 24 ఏమైనా అట్టర్ ఫ్లాప్ అయిందా అంటే అది కూడా జరగలేదు. తెలుగుతో పాటు తమిళనాట ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతోంది. పోనీ సూర్య ఎవరితోనైనా దురుసుగా ప్రవర్తించాడా అంటే అది కూడా లేదు. ఇవేవీ రీజన్స్ కానప్పటికీ సూర్య తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. తనను క్షమించండి అంటూ పబ్లిక్ గా ఉత్తరం రాశాడు. సూర్య ఇలా బహిరంగంగా క్షమాపణలు కోరడానికి బలమైన కారణం ఉంది. తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో సూర్య ఓటు వేయలేదు.అందుకే తమిళ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. ఓ బాధ్యత కలిగిన పౌరుడిగా, నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన తను ఓటు హక్కు వినియోగించుకోలేకపోయానని సూర్య చెప్పుకొచ్చాడు. తప్పించుకోలేని పరిస్థితుల మధ్య ఉండిపోవడం వల్ల ఓటు వేయలేకపోయానని, తనను క్షమించాలని సూర్య అభ్యర్థించాడు. సూర్య ఇలా బహిరంగంగా క్షమాపణలు కోరడంతో… ప్రజల్లో మరిన్ని ఎక్కువ మార్కులు కొట్టేశాడు.

Click on Image to Read:

Advertisement

Similar News