అమరావతి నిర్మాణంతో పెనుముప్పు

కృష్ణా నదికి ఆనుకుని ఏపీ రాజధాని నిర్మాణంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, తాజాగా ఢిల్లీలోని నేచురల్ హెరిటేజ్ ఫస్ట్ సంస్థ ప్రొఫెసర్ విక్రమ్ సోని తన బృందంతో కలిసి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మిస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నదికి ఇరువైపుల రెండున్నర కిలోమీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సూచించారు. నదికి ఇరువైపుల రెండున్నర కిలోమీటర్ల వరకు […]

Advertisement
Update: 2016-05-16 00:05 GMT

కృష్ణా నదికి ఆనుకుని ఏపీ రాజధాని నిర్మాణంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, తాజాగా ఢిల్లీలోని నేచురల్ హెరిటేజ్ ఫస్ట్ సంస్థ ప్రొఫెసర్ విక్రమ్ సోని తన బృందంతో కలిసి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మిస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నదికి ఇరువైపుల రెండున్నర కిలోమీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సూచించారు. నదికి ఇరువైపుల రెండున్నర కిలోమీటర్ల వరకు భారీగా ఇసుక ఉందన్నారు. దాదాపు 40 మీటర్ల లోతు వరకు ఇసుక పొరలే ఉన్నాయన్నారు. ఇలాంటి చోట భారీ నిర్మాణాలు మంచిదికాదన్నారు. నది ప్రవాహం పెరిగినప్పుడు ఇసుక పొరల్లోకి నీరు చొరబడుతుందని అన్నారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియేనని ఇలాంటిచోట నిర్మాణాలు సరికాదన్నారు. నదికి ఆనుకుని భారీ భవనాలు నిర్మిస్తే భూగర్భజలాలు భారీగా అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లుతుందని ప్రొఫెసర్ విక్రమ్ సోని ఆందోళన వ్యక్తం చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News