ఆయ‌న క‌థ‌..శంక‌ర్ డైరెక్ష‌న్.. ఇప్పుడెలా??

ఇండస్ట్రీలోని వ్యక్తులు మాత్రమే కాక ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ సైతం ..తన ఫిల్మోగ్రఫీ..రెండు పార్ట్ లు చేస్తే… సుజాతతో, దురదృష్టవశాత్తు సుజాత లేకుండా అని విభజించాలని చెప్తూంటారు. ఇంతకీ ఈ సుజాత ఎవరూ అంటే శంకర్ సూపర్ హిట్స్ అన్నిటికి దాదాపు కథలు ఆయనవే. శంకర్ సినిమాలకు మూల కథలు చాలా వరకు ఆయనవి కావు. స్క్రీన్ ప్లేలు మాత్రమే ఆయన తయారుచేసుకుంటారు. ప్రారంభంలో బాలకుమురన్ అనే సుప్రసిద్ధ తమిళ రచయిత శంకర్ సినిమాలకు కథలు […]

Advertisement
Update: 2016-05-14 03:38 GMT

ఇండస్ట్రీలోని వ్యక్తులు మాత్రమే కాక ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ సైతం ..తన ఫిల్మోగ్రఫీ..రెండు పార్ట్ లు చేస్తే… సుజాతతో, దురదృష్టవశాత్తు సుజాత లేకుండా అని విభజించాలని చెప్తూంటారు. ఇంతకీ ఈ సుజాత ఎవరూ అంటే శంకర్ సూపర్ హిట్స్ అన్నిటికి దాదాపు కథలు ఆయనవే. శంకర్ సినిమాలకు మూల కథలు చాలా వరకు ఆయనవి కావు. స్క్రీన్ ప్లేలు మాత్రమే ఆయన తయారుచేసుకుంటారు. ప్రారంభంలో బాలకుమురన్ అనే సుప్రసిద్ధ తమిళ రచయిత శంకర్ సినిమాలకు కథలు అందించారు. తర్వాత సుజాత కథలతో సినమాలు చేసారాయన. ఈ బాలకుమురన్ తమిళ హిట్ సినిమాలకు రచయిత.

కమల్ హాసన్ గుణ, రజనీ భాషా, శింబు మన్మధ సినిమాల కథలు కూడా ఆయనవే. దాంతో ఆయన అండతో శంకర్ విజయాలు సాధించారు. తర్వాత సుజాత అండతో పెద్ద హిట్స్ కొట్టారు. కానీ సుజాత మరణం తర్వాత ఆయన చేసిన చిత్రం ఐ డిజాస్టర్ అయ్యింది. ఐ చూసిన ప్రతీ ఒక్కరూ ..శంకర్ కేవలం దృష్టి మొత్తం టెక్నాలజీ మీదనే పెట్టారని , కథను విస్మరించారని చెప్తారు. మరి కథను విస్మరించటానికి ..సుజాత లాంటి రచయిత శంకర్ కి దొరక్క పోవడమే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం రోబో 2.0 చిత్రం చేస్తున్నాడు. ఈసినిమా పై గంపెడాశ‌లు పెట్టుకున్నారు.

Advertisement

Similar News