మహేష్ ను యాడ్ తో పడేశాడు...

ఒక్కో హీరోకు ఒక్కో బలహీనత ఉంటుంది. పవన్ కు గన్స్ చూపిస్తే చాలు అనే విషయం ఇప్పటికే చాలామందికి తెలుసు. మహేష్ కు కూడా ఇప్పుడు అలాంటిదే ఓ వీక్ నెస్ తెలిసొచ్చింది. డిఫరెంట్ గా ఉండే యాడ్ కాన్సెప్ట్స్ చెబితే చాలు మహేష్ పడిపోతాడు. తనను కొత్తగా చూపిస్తూ… ఆకట్టుకునేలా వాణిజ్య ప్రకటన తీసే వాళ్లంటే మహేష్ కు చాలా ఇష్టం. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ విషయాన్ని బయపెట్టాడు కూడా. తాజాగా మెహర్ రమేష్ కూడా […]

Advertisement
Update: 2016-05-10 23:59 GMT
ఒక్కో హీరోకు ఒక్కో బలహీనత ఉంటుంది. పవన్ కు గన్స్ చూపిస్తే చాలు అనే విషయం ఇప్పటికే చాలామందికి తెలుసు. మహేష్ కు కూడా ఇప్పుడు అలాంటిదే ఓ వీక్ నెస్ తెలిసొచ్చింది. డిఫరెంట్ గా ఉండే యాడ్ కాన్సెప్ట్స్ చెబితే చాలు మహేష్ పడిపోతాడు. తనను కొత్తగా చూపిస్తూ… ఆకట్టుకునేలా వాణిజ్య ప్రకటన తీసే వాళ్లంటే మహేష్ కు చాలా ఇష్టం. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ విషయాన్ని బయపెట్టాడు కూడా. తాజాగా మెహర్ రమేష్ కూడా ఇదే యాంగిల్ లో మహేష్ ను పడగొట్టాడు. ఓ రియల్ ఎస్టేట్ యాడ్ కోసం మహేష్ ను డైరక్ట్ చేసిన మెహర్ రమేష్… తన స్టయిలిష్ టేకింగ్ తో ప్రిన్స్ ప్రశంసలు అందుకున్నాడు. మరి ఇదే ఊపులో మహేష్ తో సినిమా కూడా తీసే ఛాన్స్ ఉందని అప్పుడే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లే మహేష్ అభిమానుల్ని కలవరపెడుతున్నాయి. ఎందుకంటే… మెహర్ ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తో కంత్రి సినిమా చేసిన ఈ దర్శకుడు తర్వాత శక్తి, షాడో అంటూ రెండు భయంకరమైన డిజాస్టర్లు తీశాడు. ఆ దెబ్బకు మనోడికి ఆఫర్లు ఇవ్వడానికి హీరోలు భయపడ్డారు. ఇలాంటి టైమ్ లో మహేష్ తో మెహర్ రమేష్ కనిపించడం అభిమానుల్ని కలవరానికి గురిచేసింది.
Tags:    
Advertisement

Similar News