టీటీడీపీకి పొంచి ఉన్న మ‌రో షాక్

తెలంగాణ‌లో టీడీపీ నామ‌రూపం లేకుండా పోయే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. 15 మంది ఎమ్మెల్యేల‌లో ఇప్ప‌టికే 12 మంది కారెక్కేయ‌గా ముగ్గురు మాత్రమే మిగిలారు. ఇప్పుడు ఈ అవ‌శేషాల‌ను కూడా అధికార పార్టీ టార్గెట్ చేసిన‌ట్టుగా చెబుతున్నాయి. ఎమ్మెల్యే ఆర్. కృష్ణ‌య్య ఎలాగో టీడీపీ కార్య‌క్ర‌మాలు వ‌దిలేసి బీసీ సంఘం వ్య‌వ‌హ‌రాలు చూసుకుంటున్నారు. ఇక మిగిలింది ఓటుకు నోటు నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌లు మాత్ర‌మే. రేవంత్ సంగ‌తి ప‌క్క‌న పెడితే వెంక‌ట వీర‌య్య కూడా టీఆర్ ఎస్‌లోకి వెళ్లేందుకు […]

Advertisement
Update: 2016-05-10 01:20 GMT

తెలంగాణ‌లో టీడీపీ నామ‌రూపం లేకుండా పోయే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. 15 మంది ఎమ్మెల్యేల‌లో ఇప్ప‌టికే 12 మంది కారెక్కేయ‌గా ముగ్గురు మాత్రమే మిగిలారు. ఇప్పుడు ఈ అవ‌శేషాల‌ను కూడా అధికార పార్టీ టార్గెట్ చేసిన‌ట్టుగా చెబుతున్నాయి. ఎమ్మెల్యే ఆర్. కృష్ణ‌య్య ఎలాగో టీడీపీ కార్య‌క్ర‌మాలు వ‌దిలేసి బీసీ సంఘం వ్య‌వ‌హ‌రాలు చూసుకుంటున్నారు. ఇక మిగిలింది ఓటుకు నోటు నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌లు మాత్ర‌మే. రేవంత్ సంగ‌తి ప‌క్క‌న పెడితే వెంక‌ట వీర‌య్య కూడా టీఆర్ ఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఖ‌మ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకట వీరయ్య.. కేటీఆర్ తో మంతనాలు జరిపినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఆయన కారెక్కడం ఖాయమంటున్నారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను సండ్ర కూడా ఖండించడం లేదు. మీడియా ప్రతినిధులు ఆయనను సంప్రదించగా టీఆర్ఎస్ లో చేరడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ వీడుతున్నట్టు వస్తున్న వార్తలను మాత్రం ఖండించలేదు. మొత్తం మీద సండ్ర కూడా పార్టీ వీడితే టీడీపీకి రేవంత్ రెడ్డి ఒక్కరే మిగిలే అవకాశం ఉంది. అయితే ఓటుకు నోటు కేసు నిందితుడిగా ఉన్న సండ్రను పార్టీలోకి తీసుకుంటే ఆ నిర్ణయాన్ని టీఆర్ఎస్ ఎలా సమర్ధించుకుంటుందో.

click on Image to Read:

Tags:    
Advertisement

Similar News