అత్యుత్తమ క్రీడా పురస్కారానికి విరాట్ పేరు సిఫార్సు

క్రికెటర్ విరాట్ కోహ్లి మరో అరుదైన గౌరవం దక్కించుకోబోతున్నారు.  టెస్ట్, వన్డే, టీ-20 ఇలా అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్న కోహ్లీని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు బీసీసీఐ సిఫార్సు చేసింది. అత్యుత్తమ క్రీడా పురస్కారం అయిన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును క్రికెట్ రంగం నుంచి సచిన్,  ధోని మాత్రమే ఇప్పటి వరకు సొంతం చేసుకున్నారు. 1997లో సచిన్ ను, 2007లో ధోనిని ఈ అవార్డును వరించింది. అర్జున అవార్డు కోసం అజింక్యా రహానే పేరును […]

Advertisement
Update: 2016-05-03 01:15 GMT

క్రికెటర్ విరాట్ కోహ్లి మరో అరుదైన గౌరవం దక్కించుకోబోతున్నారు. టెస్ట్, వన్డే, టీ-20 ఇలా అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్న కోహ్లీని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు బీసీసీఐ సిఫార్సు చేసింది. అత్యుత్తమ క్రీడా పురస్కారం అయిన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును క్రికెట్ రంగం నుంచి సచిన్, ధోని మాత్రమే ఇప్పటి వరకు సొంతం చేసుకున్నారు. 1997లో సచిన్ ను, 2007లో ధోనిని ఈ అవార్డును వరించింది. అర్జున అవార్డు కోసం అజింక్యా రహానే పేరును బీసీసీఐ ప్రతిపాదించింది. బీసీసీఐ సిఫార్సును కేంద్రం ఆమోదించడం లాంచనప్రాయమేనని భావిస్తున్నారు. ఇప్పటికే కోహ్లి అర్జున అవార్డును సొంతం చేసుకున్నారు. రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు కింద పతకం, సర్టిఫికెట్‌తో పాటు ఏడున్నర లక్షల నగదును అందజేస్తారు. ‘అర్జున’ అవార్డు కింద జ్ఞాపిక, సర్టిఫికెట్, 5 లక్షల నగదును క్రీడాకారులకు అందజేస్తారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News