ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉమెన్స్ హాస్టల్, కాలేజ్‌?

రాష విభజన తర్వాత బోసిపోయిన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి ఇతర అవసరాలకు వినియోగించేందుకు టీడీపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. ఉమెన్స్ హాస్టల్‌తోపాటు ఉమెన్స్ కాలేజ్‌ ఏర్పాటుకు భవంతులను ఇవ్వాలని టీడీపీ భావిస్తోందని సమాచారం. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను నిర్మించారు. కేబీఆర్‌ పార్కు మెయిన్ గేట్‌ ఎదురుగానే చాలా ఖరీదైన ప్రాంతంలో ఏడు ఎకరాల్లో దీన్ని నిర్మించారు. అప్పట్లో హైటెక్ సిటీ నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఎల్ అండ్ టీ సంస్థ […]

Advertisement
Update: 2016-04-28 21:18 GMT

రాష విభజన తర్వాత బోసిపోయిన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి ఇతర అవసరాలకు వినియోగించేందుకు టీడీపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. ఉమెన్స్ హాస్టల్‌తోపాటు ఉమెన్స్ కాలేజ్‌ ఏర్పాటుకు భవంతులను ఇవ్వాలని టీడీపీ భావిస్తోందని సమాచారం.

చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను నిర్మించారు. కేబీఆర్‌ పార్కు మెయిన్ గేట్‌ ఎదురుగానే చాలా ఖరీదైన ప్రాంతంలో ఏడు ఎకరాల్లో దీన్ని నిర్మించారు. అప్పట్లో హైటెక్ సిటీ నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఎల్ అండ్ టీ సంస్థ ఉచితంగా దీన్ని నిర్మించి ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. వందేళ్ల లీజుపై ఏడాదికి కేవలం 20 వేలు చెల్లించే ఒప్పందంతో ఈ స్థలాన్ని టీడీపీ తీసుకుంది. మొన్నటి వరకు ఈ భవనం ఒక వెలుగు వెలిగింది. అయితే రాష్ట్ర విభజనతతో పాటు ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు ఇక్కడికి రావడం పూర్తిగా మానేశారు. కీలక నేతలు కూడా ఈ భవనం వైపు కన్నెత్తి చూడడం లేదు.

పార్టీ కార్యక్రమాలను గుంటూరు, విజయవాడకు పరిమితం చేశారు. ట్రస్ట్ భవన్ ప్రాంగణంలో అనేక భవనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను ఒక భవనానికి పరిమితం చేసి మిగిలిన భవనాలను మహిళా కాలేజ్, ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటుకు ఇస్తే బాగుంటుందని కొందరు నేతలు ప్రతిపాదిస్తున్నారు. ఇలా చేస్తే ట్రస్ట్ భవన్ నిర్వాహణ ఖర్చులు వస్తాయని సూచిస్తున్నారు.

పార్టీ కార్యకాలాపాలు కాకుండా ప్రస్తుతం ట్రస్ట్‌భవన్‌లో ఎన్‌టిఆర్ బ్లడ్ బ్యాంకు నిర్వహణ, ఎన్‌టిఆర్ మోడల్ స్కూల్ కేంద్ర కార్యాలయం, పార్టీకి అవసరమైన మెటీరియల్ తయారు చేయటం లాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇపుడు జరుగుతున్న కార్యకలాపాలకు ఇన్ని భవంతులు అవసరం లేదని నిర్ధారించుకున్నారు. పెద్ద పెద్ద భవంతులు, విశాలమైన ఖాళీ స్ధలం నిరుపయోగంగా మారిపోతుందని ట్రస్ట్‌భవన్ వర్గాలు అంచనా వేసాయి. ఇదే విషయాన్ని ఇటీవల చంద్రబాబు వద్ద చర్చ జరిగినట్లు సమాచారం. రోజు వారీ జరుగుతున్న పార్టీ కార్యకలాపాలు, ఇతరత్రా వ్యవహారాలపై ట్రస్ట్‌భవన్ బాధ్యులు చంద్రబాబుకు ఒక నివేదిక అందచేసినట్లు తెలిసింది.

ఇపుడు జరుగుతున్న కార్యకలాపాలన్నింటినీ ఒకే భవనంలోకి మార్చేసి రెండో భవనంలో కొద్ది పాటి మార్పులు చేస్తే మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయటానికి అనువుగా ఉంటుందని ట్రస్ట్‌భవన్ వర్గాలు సూచించినట్లు తెలిసింది. ఎలాగూ భారీ కిచెన్, డైనింగ్ హాల్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని హాస్టల్ నిర్వాహణకు వాడుకోవచ్చని సూచిస్తున్నారు. లైబ్రరి భవనంపైన మరో రెండంతస్తులు వేయగలిగితే డిగ్రీ కళాశాలకు హాస్టల్‌ను కూడా జతచేయవచ్చని ట్రస్ట్‌భవన్ సూచించినట్లు సమాచారం. అయితే దీనిపై చంద్రబాబు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మొత్తం మీద ఒకప్పుడు ఒక వెలుగువెలిగిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ కాలేజ్‌, హాస్టల్‌గా మారుతోందంటూ వార్తలు రావడం బట్టి కాలంతో పాటు ఊహించని మార్పులు సహజం అనిపిస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News