ఏపీ రాజకీయాలపై రాయపాటి తీవ్ర అసంతృప్తి

సీనియర్ నేత, నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పూర్తి అనారోగ్యకరంగా ఉన్నాయని వాపోయారు. ఈ రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నాని వాపోయారు. త్వరలో రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. గుంటూరులో రాయపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గపరిధిలో దశాబ్దాలు గడుస్తున్నా తాగునీటి సమస్యను కూడా తీర్చలేకపోయామని వాపోయారు. తాగునీటికోసం 1150 కోట్ల ప్రతిపాదనతో ప్రభుత్వానికి నివేదిక పంపానని… అయితే నిధులు లేవని రాష్ట్ర ప్రభుత్వం […]

Advertisement
Update: 2016-04-28 23:46 GMT

సీనియర్ నేత, నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పూర్తి అనారోగ్యకరంగా ఉన్నాయని వాపోయారు. ఈ రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నాని వాపోయారు. త్వరలో రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. గుంటూరులో రాయపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గపరిధిలో దశాబ్దాలు గడుస్తున్నా తాగునీటి సమస్యను కూడా తీర్చలేకపోయామని వాపోయారు. తాగునీటికోసం 1150 కోట్ల ప్రతిపాదనతో ప్రభుత్వానికి నివేదిక పంపానని… అయితే నిధులు లేవని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన కేంద్రానికి పంపిందన్నారు. బీజేపీలో చేరుతారా అన్న ప్రశ్నకు నైరాశ్యంతో రాయపాటి స్పందించారు. అక్కడ చేరిన వారే పనిలేక ఖాళీగా ఉన్నారని తాను వెళ్లిమాత్రం ఏం చేయగలనని బదులిచ్చారు.

రాయపాటి తీరును బట్టి ఆయన టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా చెబుతున్నారు. మరో దారి లేక ఆయన పార్టీలో ఉన్నారని… చివరకు రాజకీయల నుంచి తప్పుకుంటానని చెప్పే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నారు. అయితే ఆయన అసంతృప్తికి రాజకీయ విశ్లేషకులు మరో కారణం చెబుతున్నారు. గతంలో కూడా ఆయన కిరణ్ కుమార్ రెడ్డిని బెదిరించి తన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకున్నాడు. కానీ కిరణ్ “తారా చౌదరి” కథ, స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ ముందు రాయపాటి దిమ్మతిరిగి పడిపోయాడు. మళ్లీ ఇప్పుడు టీటీడీ చైర్మన్ గిరీ కోసం ప్రజల బాధలు ఆయనకు గుర్తొచ్చి మహాత్మాగాంధీ లెవల్లో ప్రజాసేవ చేయలేని ఈ రాజకీయాలు ఎందుకు? అని కొత్త నాటకానికి తెరతీశాడని ఆయన విమర్శకుల అభిప్రాయం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News