ప్రత్యేక హోదాపై సూటిగా తేల్చేసిన కేంద్రం, భగ్గుమన్న వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదాపై కేంద్రం తేల్చేసింది. ప్రత్యేక హోదాపై ఆశలు వద్దని రాజ్యసభ సాక్షిగా స్పష్టం చేసింది. ప్రత్యేకహోదాపై రాజ్యసభ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి  హెచ్‌పీ చౌదరి… నీతి ఆయోగ్‌ ప్రత్యేక హోదాకు అంగీకరించలేదని చెప్పారు. ప్రత్యేక హోదా అవసరం ఏపీకి లేదన్నారు. విభజన చట్టంలో హామీలను నెరవేర్చేందుకు మాత్రం కట్టుబడి ఉన్నామని మాత్రం చెప్పారు. కేంద్రమంత్రి ప్రకటనపై వైసీపీ మండిపడింది.   వెంటనే టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ […]

Advertisement
Update: 2016-04-29 08:54 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదాపై కేంద్రం తేల్చేసింది. ప్రత్యేక హోదాపై ఆశలు వద్దని రాజ్యసభ సాక్షిగా స్పష్టం చేసింది. ప్రత్యేకహోదాపై రాజ్యసభ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి హెచ్‌పీ చౌదరి… నీతి ఆయోగ్‌ ప్రత్యేక హోదాకు అంగీకరించలేదని చెప్పారు. ప్రత్యేక హోదా అవసరం ఏపీకి లేదన్నారు. విభజన చట్టంలో హామీలను నెరవేర్చేందుకు మాత్రం కట్టుబడి ఉన్నామని మాత్రం చెప్పారు.

కేంద్రమంత్రి ప్రకటనపై వైసీపీ మండిపడింది. వెంటనే టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. కేంద్రం నుంచి బయటకు వస్తారా… లేక ఏపీ కేబినెట్‌లో ఉన్న బీజేపీ మంత్రులను వెనక్కు పంపుతారా ఏదో ఒకటి తేల్చాలని చంద్రబాబును వైసీపీ నేత జోగి రమేష్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదన్న కేంద్రమంత్రి ప్రకటనపై చంద్రబాబు వెంటనే స్పందించాలన్నారు. చంద్రబాబునాయుడు ఒక అసమర్థ సీఎంగా తయారయ్యారని రమేష్ మండిపడ్డారు .

ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అరుపులు అరిచిన వెంకయ్యనాయుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలుగు జాతికి చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలిసి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు జోగి రమేష్. కేంద్రమంత్రి ప్రకటనతో ఏపీ బీజేపీ, టీడీపీ ఇరుకునపడ్డట్టే. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వాలి అంటూ అప్పట్లో రాజ్యసభలో కేకలు వేసిన వెంకయ్యనాయుడు ఏమంటారో?. ప్రశ్నిస్తా.. జనం కోసం ఎవరినైనా ప్రశ్నిస్తా అన్న పవన్‌ కల్యాణ్ ఇప్పటికైనా ప్రశ్నిస్తారో లేదో?. లేక ఎప్పటిలాగే వెంకయ్య తన పలుకుబడి ఉపయోగించి కేంద్రంలోని ఏదో ఒక మంత్రి చేత ప్రత్యేక హోదా అంశం ఇంకా పరిశీలనలో ఉంది అంటూ స్టేట్‌మెంట్ ఇప్పించి మళ్లీ వాయిదా పద్దతుల్లో జనం చెవిలో పూలు పెడుతారో?. చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News