జగన్ కు కీలకమైన అనుమానం, ప్రతిపాదన

సేవ్ డెమొక్రసి పేరుతో ఢిల్లీలో జాతీయ నాయకులను కలుస్తున్న జగన్ … గురువారం కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా జగన్ ఈసీ ముందు ఒక కీలకమైన అనుమానం వ్యక్తం చేశారు. అందుకు విరుగుడుగా ఒక ప్రతిపాదన కూడా చేశారు.  2019 లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రెండు చోట్ల వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటేసిన వారే […]

Advertisement
Update: 2016-04-28 09:21 GMT

సేవ్ డెమొక్రసి పేరుతో ఢిల్లీలో జాతీయ నాయకులను కలుస్తున్న జగన్ … గురువారం కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా జగన్ ఈసీ ముందు ఒక కీలకమైన అనుమానం వ్యక్తం చేశారు. అందుకు విరుగుడుగా ఒక ప్రతిపాదన కూడా చేశారు. 2019 లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

రెండు చోట్ల వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటేసిన వారే తిరిగి ఏపీలోనూ ఓటేస్తున్నారని ఈసీ దృష్టికి జగన్ తీసుకెళ్లారు. జగన్ చేసిన ఈ ప్రతిపాదన వెనుక మొన్నటి ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనలే కారణమని చెబుతున్నారు. 2014లో తెలంగాణ, ఏపీలో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరగడంతో టీడీపీ నేతలు పెద్దెత్తున ఓటర్లను అటు ఇటు తరలించారు. టీడీపీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉంటున్న కొన్ని వర్గాల ఓటర్లు జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికంగా ఉన్నారని చెబుతుంటారు.

దీన్ని ఆసరాగా చేసుకుని మొన్నటి ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు తన సొంత ఖర్చుతో, బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసి హైదరాబాద్‌ నుంచి ఏపీకి ఓటర్లను తరలించారు. ఆ ఓటర్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటేశారని వార్తలొచ్చాయి. అందువల్లే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయినా హైదరాబాద్ పరిధిలో మాత్రం టీడీపీ తన హవా చాటగలిగింది. అక్కడ ఏపీలోనూ కొన్ని జిల్లాల్లో టీడీపీకి అనుకూల ఫలితాలు వచ్చేలా ఈ ఓటర్లు సాయపడ్డారని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జగన్‌ వచ్చే ఎన్నికల్లో ఏపీ, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒకే సారి ఓటింగ్ నిర్వహించాలని కోరినట్టు భావిస్తున్నారు.

అంతే కాదు …. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని అసెంబ్లీ స్పీకర్ చేతుల్లోంచి తీసేసి ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి తెచ్చేలా చూడాలని ఈసీని జగన్‌ కోరారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News