ఫిరాయింపులపై అలిగిన మరో టీడీపీ ఎమ్మెల్యే

లోకల్ లీడర్ల అభిప్రాయాలతో సంబంధం లేకుండా చంద్రబాబు బలవంతంగా సాగిస్తున్న ఫిరాయింపు రాజకీయాలు పలుచోట్ల చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. విశాఖ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిని టీడీపీలోకి తీసుకురావడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆగ్రహంగా ఉన్నారు. తన చేతిలో ఓడిన వ్యక్తిని పార్టీలోకి ఎందుకు తీసుకొస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.  దీని వెనుక ఏదో కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గండి బాబ్జి పార్టీలో చేరే కార్యక్రమానికి కూడా బండారు డుమ్మా కొట్టారు. […]

Advertisement
Update: 2016-04-28 08:24 GMT

లోకల్ లీడర్ల అభిప్రాయాలతో సంబంధం లేకుండా చంద్రబాబు బలవంతంగా సాగిస్తున్న ఫిరాయింపు రాజకీయాలు పలుచోట్ల చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. విశాఖ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిని టీడీపీలోకి తీసుకురావడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆగ్రహంగా ఉన్నారు. తన చేతిలో ఓడిన వ్యక్తిని పార్టీలోకి ఎందుకు తీసుకొస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వెనుక ఏదో కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గండి బాబ్జి పార్టీలో చేరే కార్యక్రమానికి కూడా బండారు డుమ్మా కొట్టారు. బండారే కాకుండా మంత్రి గంటాతో పాటు ఎంపీ అవంతి, ఎమ్మెల్యేలు అనిత, గణబాబు, పీలా గోవింద్, రమేష్ కూడా గండి బాబ్జి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గంటా వర్గం ఎమ్మెల్యేలు కూడా గండి బాబ్జి పార్టీలో చేరే కార్యక్రమానికి హాజరుకాలేదు. ఒక పద్దతి ప్రకారం ఇప్పటి నుంచే తమకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని బండారుతో పాటు గంటా వర్గం భావిస్తోంది. గండి బాబ్జి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు చాలా సన్నిహితుడు.

గండి బాబ్జి విషయంలోనే కాదు… గొట్టిపాటి రవికుమార్ చేరికను అద్దంకి టీడీపీ నేత కరణం బలరాం, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేరికను రామసుబ్బారెడ్డి, భూమా చేరికను శిల్పా సోదరులు, ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు చేరిన ప్రతి నియోజకవర్గంలోనూ ఒక వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వచ్చింది. అయితే టీడీపీ అధికారంలో ఉండడంతో ఎవరూ చంద్రబాబును ధిక్కరించకుండా మౌనంగా ఉండిపోతున్నారని చెబుతుంటారు. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో అసెంబ్లీ సీట్లు పెరక్కపోతే అప్పుడు ఏదో ఒక వర్గం తిరుగుబాటు చేయడం ఖాయమని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News