శ్రీశైలం డ్యాంలో మునిగి ఈ మాట చెప్పగలవా జేసీ..

ఈ మధ్య చంద్రబాబు ఒక పద్దతి ప్రకారం పదవులిస్తున్నారు. ఒక సామాజికవర్గంలో ఎవరైనా యాక్టివ్‌గా ఉన్నా, ఎక్కువ గొంతు చించుకుంటున్నా వెంటనే బాబు దృష్టి సారిస్తున్నారు. ఈ కులం కోటాలో ఏదో ఒక పదవి అప్పగిస్తున్నారు. ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ కోటాలో మంత్రి పదవి కొట్టేసేందుకు సిద్ధమయ్యారో ఏమో గానీ జేసీ దివాకర్ రెడ్డి… చంద్రబాబును ఓ రేంజ్‌లో పొడిగేశారు. రెడ్డి కులం మొత్తం మీ వెంటే ఉంటుందంటూ సదరు సామాజికవర్గం పరువును పౌరుషాన్ని బాబు కాళ్ల […]

Advertisement
Update: 2016-04-28 04:54 GMT

ఈ మధ్య చంద్రబాబు ఒక పద్దతి ప్రకారం పదవులిస్తున్నారు. ఒక సామాజికవర్గంలో ఎవరైనా యాక్టివ్‌గా ఉన్నా, ఎక్కువ గొంతు చించుకుంటున్నా వెంటనే బాబు దృష్టి సారిస్తున్నారు. ఈ కులం కోటాలో ఏదో ఒక పదవి అప్పగిస్తున్నారు. ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ కోటాలో మంత్రి పదవి కొట్టేసేందుకు సిద్ధమయ్యారో ఏమో గానీ జేసీ దివాకర్ రెడ్డి… చంద్రబాబును ఓ రేంజ్‌లో పొడిగేశారు. రెడ్డి కులం మొత్తం మీ వెంటే ఉంటుందంటూ సదరు సామాజికవర్గం పరువును పౌరుషాన్ని బాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టేశారు. అంతటితో ఆగితే బాధపడేది రెడ్లు మాత్రమే. కానీ రాయలసీమ ఘోషను కూడా బాబు కాళ్ల దగ్గర జేసీ ఉంచేశారు.

రెండేళ్లలో కోనసీమను తలదన్నేలా రాయలసీమ, ముఖ్యంగా అనంతపురం జిల్లా తయారవుతుందని ఫిరాయింపు సభలో జేసీ చెప్పుకొచ్చారు. రాయలసీమకు నీరు ఇచ్చి కృష్ణా, గుంటూరు జిల్లాలను తలదన్నే రీతిలో సీమను అది కూడా రెండేళ్లలోనే మార్చేస్తారని జేసీ డబ్బా వాయించారు. అయితే జేసీ మాటలు ఎంత అవమానకరమో ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి మట్టమే చెబుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 854 అడుగుల నీటి మట్టం ఉంటేనే రాయలసీమకు నీరందుతుంది. కానీ ఇప్పుడు శ్రీశైలం నీటిమట్టాన్నిఅటు కేసీఆర్, ఇటు బాబు కలిసి 790 అడుగుల దిగువకు తీసుకెళ్లారు.

రాయలసీమ నాశనం అయిపోతోందని మొత్తుకున్నా పోటీ పడి విద్యుత్ సరఫరా పేరుతో దిగువకు నీరొదిలింది బాబు సర్కార్‌. పట్టిసీమ పూర్తి కాగానే గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు ఇచ్చి … ఆమేరకు నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు మళ్లిస్తామని రెండేళ్లుగా చెబుతున్నారు బాబు. పట్టిసీమ పూర్తయింది… మరి సీమకు నీళ్లు రాలేదే. పైగా కనీస నీటిమట్టం 834 అడుగులు ఉంచాలన్న నిబంధనలను కూడా తొక్కేసి 790 అడుగులకు శ్రీశైలం నీటి మట్టాన్ని తీసుకెళ్లిన చంద్రబాబు రాయలసీమకు నీరు ఇస్తారా?. జేసీ చెబితే సీమజనం సీమగొర్రెల్లా నమ్మాలా?. అది కూడా రెండేళ్లలో కోనసీమను అనంతపురం జిల్లా మించిపోతుందంటే నవ్వుకే నవ్వురాదా?. పదవులు కావాలంటే తాకట్టు పెట్టడానికి చాలా ఉంటాయి. ఇలా ఒక కులం గౌరవాన్ని, రాయలసీమ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడం సరికాదేమో!.

Click on Image to Read:

Advertisement

Similar News