బీజేపీకి సవాల్ విసిరిన బాబు పత్రిక

చూస్తుంటే ఏపీ అభివృధ్ధిలో టీడీపీ ప్రభుత్వం చేతులెత్తేసినట్టే ఉంది. ఏమీ చేయలేమని డిసైడ్ అయిపోయి అందుకు కారణం కేంద్రమే అని  చాటింపు మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది.  టీడీపీని భుజాన వేసుకుని  నడుస్తున్న ప్రముఖ పత్రిక ఒకటి  బీజేపీ నేతలకు దిమ్మతిరిగేలా ఒక కథనం రాసింది.  అయితే ఇప్పటి వరకు ఒక్క ఏపీ బీజేపీ నేత కూడా దానిపై స్పందించకపోవడం మరో విచిత్రం. అన్నం పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్టుగా కేంద్రం ఏపీ విషయంలో వ్యవహరిస్తోందని విమర్శించిన సదరు పత్రిక హుద్ […]

Advertisement
Update: 2016-04-26 04:55 GMT

చూస్తుంటే ఏపీ అభివృధ్ధిలో టీడీపీ ప్రభుత్వం చేతులెత్తేసినట్టే ఉంది. ఏమీ చేయలేమని డిసైడ్ అయిపోయి అందుకు కారణం కేంద్రమే అని చాటింపు మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది. టీడీపీని భుజాన వేసుకుని నడుస్తున్న ప్రముఖ పత్రిక ఒకటి బీజేపీ నేతలకు దిమ్మతిరిగేలా ఒక కథనం రాసింది. అయితే ఇప్పటి వరకు ఒక్క ఏపీ బీజేపీ నేత కూడా దానిపై స్పందించకపోవడం మరో విచిత్రం.

అన్నం పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్టుగా కేంద్రం ఏపీ విషయంలో వ్యవహరిస్తోందని విమర్శించిన సదరు పత్రిక హుద్ హుద్ సాయం మొత్తంపై ఆసక్తికరంగా కథనం రాసింది. హుద్‌హుద్‌ తుఫాను సమయంలో కేంద్ర తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు ప్రకటించింది. కానీ అందులోనూ కోత పెట్టి కేవలం 678 కోట్లు మాత్రమే ఇచ్చారని చంద్రబాబు నుంచి మంత్రుల వరకు గగ్గోలు పెట్టారు. అయితే మంగళవారం చంద్రబాబు అనుకూల పత్రిక హుద్‌హుద్ సాయం కింద కేంద్రం ఇచ్చింది కేవలం రూ. 70 కోట్లు మాత్రమేనని ప్రకటించింది. ఇదేమిటని కేంద్రాన్ని నిలదీస్తే మీ లెక్కలు మేం నమ్మం, మేం ఇచ్చేది ఇంతేనని విదిల్చిందట. కానీ ఇదే పత్రిక 26- 11- 2015లో హుద్‌ హుద్ సాయం కింద కేంద్రం రూ. 400 కోట్లు ఇచ్చిందని రాసింది. ఇప్పుడు మాత్రం హుద్‌హుద్‌కు కేంద్రం ఇచ్చింది రూ. 70 కోట్లు మాత్రమే అంటోంది. అయితే తొలి విడత ఇచ్చిన మొత్తానికి ఏపీ లెక్కలు చెప్పకపోవడం వల్లే మలివిడత హుద్ హుద్ సాయం అందలేదన్నది ఐఏఎస్‌లు చెబుతున్న కారణం.

చంద్రన్న కానుకలు, దుబారా ఖర్చులను రెవెన్యూ లోటు కింద చూపవద్దని కేంద్రం చెప్పడాన్ని కూడా టీడీపీ పత్రిక తప్పుపడుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీ)ని ఏపీ ప్రభుత్వం ఆరు లక్షల కోట్లుగా చూపగా.. ఎక్కువ చేసి చూపారని కేంద్రం అభ్యంతరం తెలిపింది. ఇలా చేయడం ద్వారా కనీసం ఆంధ్రప్రదేశ్ కు అప్పు కూడా పుట్టకుండా చేస్తోందని టీడీపీ వాయిస్ ని స్పష్టంగా వినిపించింది ఆ పత్రిక. ఇవన్నీ కాదు గానీ హుదూద్ సమయంలో ఏపీకి ఇచ్చింది కేవలం రూ. 70 కోట్లేనా అన్నది తేలాలి. గతంలో 678 కోట్లు అన్న మొత్తం ఇప్పుడు రూ. 70 కోట్లకు ఎలా మారింది?

ఇంత ధైర్యంగా కేంద్రంలోని బీజేపీపై బాబు మీడియా ఎలా దాడి చేయగలుగుతోందో?. దీన్ని ఖండించేందుకు స్టేట్లో బీజేపీ లీడర్లు ఉన్నారో లేరో!. అయినా ఏపీ బీజేపీపై బాబుకు కూడా గట్టి పట్టే ఉందంటారు. బహుశా అది నిజమే కాబోలు. మొత్తం మీద ఏపీ వచ్చే మూడేళ్లలో కూడా ఇలాగే వెనుకబడి ఉంటుందన్న మాట. అందుకు కారణం చంద్రబాబు ఏమాత్రం కాదన్న మాట. అంతా మోదీయే అన్నమాట. ఇకపై ఈ లైన్లో బాబు మీడియా వరుస కథనాలు ప్రచురించడం ఖాయం. ఇప్పటికే ఆ ప్రయత్నం మొదలైంది కూడా!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News