అది ముమ్మాటికి వ్యభిచారమే!

పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు వ్యభిచారులు అన్న విమర్శ వస్తోంది. పార్టీలు ఫిరాయించడం రాజకీయ వ్యభిచారమేనని కాంగ్రెస్ ఎంపీ విహెచ్ అన్నారు. ఒకప్పుడు నేతలు దశాబ్దాల పాటు ఒక పార్టీని నమ్ముకుని ఉండేవారని ఇప్పుడు మాత్రం ఎప్పుడు పార్టీ మారుతారో అర్థం కావడం లేదన్నారు. పొద్దున ఒక పార్టీ రాత్రికి ఒక పార్టీ మారుతున్నారని విమర్శించారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కి పిలిచి టికెట్ ఇస్తే గెలిచి పార్టీ మారడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం సమన్వయం లోపించిందన్నారు.  […]

Advertisement
Update: 2016-04-26 06:22 GMT

పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు వ్యభిచారులు అన్న విమర్శ వస్తోంది. పార్టీలు ఫిరాయించడం రాజకీయ వ్యభిచారమేనని కాంగ్రెస్ ఎంపీ విహెచ్ అన్నారు. ఒకప్పుడు నేతలు దశాబ్దాల పాటు ఒక పార్టీని నమ్ముకుని ఉండేవారని ఇప్పుడు మాత్రం ఎప్పుడు పార్టీ మారుతారో అర్థం కావడం లేదన్నారు. పొద్దున ఒక పార్టీ రాత్రికి ఒక పార్టీ మారుతున్నారని విమర్శించారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కి పిలిచి టికెట్ ఇస్తే గెలిచి పార్టీ మారడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం సమన్వయం లోపించిందన్నారు. ఈ అంశంపై పార్టీలో సమీక్ష జరగాలన్నారు.

వినాశకాలే విపరీత బుద్ది అని అందుకే టీఆర్‌ఎస్ ప్రజాస్వామ్యాన్ని హేలన చేసేలా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని టీసీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ తన చర్యలకు తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News