టీఆర్‌ఎస్‌లోకి టీడీపీ మాజీ మంత్రి

తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయ్యే స్థితికి చేరుకుంది. ఎమ్మెల్యేలే కాకుండా మాజీలు కూడా జంప్ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.  తన మిత్రుడిని టీఆర్ఎస్‌లోకి తెచ్చేందుకు మంత్రి తుమ్మలనాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారు. మండవను తీసుకురావడం ద్వారా పార్టీలో తన క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు తుమ్మల పావులు కదుపుతున్నారు. మండవ వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే […]

Advertisement
Update: 2016-04-25 04:57 GMT

తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయ్యే స్థితికి చేరుకుంది. ఎమ్మెల్యేలే కాకుండా మాజీలు కూడా జంప్ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తన మిత్రుడిని టీఆర్ఎస్‌లోకి తెచ్చేందుకు మంత్రి తుమ్మలనాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారు.

మండవను తీసుకురావడం ద్వారా పార్టీలో తన క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు తుమ్మల పావులు కదుపుతున్నారు. మండవ వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు టీఆర్‌ఎస్ వైపు ఆయన చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉండే ఒక సామాజికవర్గం నేతలు వరుస పెట్టి టీఆర్ఎస్‌లో చేరుతుండడం చర్చనీయాంశమవుతోంది.

తుమ్మల, మాగంటి గోపినాథ్‌తో పాటు చాలా మంది సదరు సామాజికవర్గం నేతలు టీఆర్ఎస్‌లో చేరిపోతున్నారు. చూస్తుంటే గ్రేటర్‌తో పాటు తెలంగాణలోకి కొన్ని ప్రాంతాల్లో నాయకత్వాన్ని టీఆర్‌ఎస్‌ ద్వారా తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు సదరు వర్గం ప్రయత్నిస్తోందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ ని కొన్ని ఏరియాల్లో తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పరిస్థితి ఉందంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News