తలసానికి షాకిచ్చిన కేసీఆర్

తెలంగాణలో పలువురు మంత్రుల శాఖలను సీఎం కేసీఆర్ మార్చారు. కీలకమైన శాఖలను అటుఇటుగా మార్చేశారు.  కుమారుడు కేటీఆర్‌కు మరోసారి అదనపు శాఖలు అప్పగించారు.  కేటీఆర్‌కు అదనంగా పరిశ్రమల శాఖతో పాటు గనులు, భూగర్భ వనరుల శాఖ, ఎన్‌ఆర్‌ఐ శాఖలను అప్పగించారు. అయితే కేటీఆర్ ఇప్పటి వరకు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖను జూపల్లి కృష్ణారావుకు ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయన పరిశ్రమల శాఖను చూస్తున్నారు. అంటే ఒక శాఖను కేటీఆర్‌, జూపల్లి మధ్య మార్పిడి చేశారన్న మాట.  హరీష్‌ […]

Advertisement
Update: 2016-04-25 11:08 GMT

తెలంగాణలో పలువురు మంత్రుల శాఖలను సీఎం కేసీఆర్ మార్చారు. కీలకమైన శాఖలను అటుఇటుగా మార్చేశారు. కుమారుడు కేటీఆర్‌కు మరోసారి అదనపు శాఖలు అప్పగించారు. కేటీఆర్‌కు అదనంగా పరిశ్రమల శాఖతో పాటు గనులు, భూగర్భ వనరుల శాఖ, ఎన్‌ఆర్‌ఐ శాఖలను అప్పగించారు. అయితే కేటీఆర్ ఇప్పటి వరకు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖను జూపల్లి కృష్ణారావుకు ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయన పరిశ్రమల శాఖను చూస్తున్నారు. అంటే ఒక శాఖను కేటీఆర్‌, జూపల్లి మధ్య మార్పిడి చేశారన్న మాట. హరీష్‌ రావు పని భారం ఎక్కువైందని చెప్పడంతో గనుల శాఖను కేటీఆర్‌కు అప్పగించారు.

తలసానికి మాత్రం డిమోషన్ ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. కీలకమైన వాణిజ్య పన్నుల శాఖను తలసాని నుంచి తొలగించారు. సదరు శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. తలసానికి పశుసంవర్ధక శాఖ అప్పగించారు. ఇప్పటి వరకు నిర్వహిస్తున్నసినిమాటోగ్రఫి తలసాని వద్దే ఉంటుంది. శాఖలు మార్చినా తనకు బీసీ సంక్షేమ శాఖ ఇస్తారని తలసాని భావించారు. కానీ పెద్దగా ప్రాధాన్యత లేని శాఖను ఆయనకు కేటాయించారు కేసీఆర్. వ్యవసాయ శాఖను నిర్వహిస్తున్న పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి అదనంగా సహకార శాఖను కూడా అప్పగించారు. కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ, గ్రామీణ నీటిసరఫరా శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. కొత్తగా కేబినెట్‌లోకి తీసుకునే వారికి ఈ రెండు శాఖలను కేటాయిస్తారని భావిస్తున్నారు. శాఖల మార్పుకు గవర్నర్ కూడా ఆమోద ముద్రవేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News