వివాదంలో చంద్రబాబు ఛాపర్ ల్యాండింగ్

గురువారం అనంతపురం జిల్లా హిందూపురంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో తీసుకున్న చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి. తాగేందుకు మంచినీరు కూడా లేక అలమటిస్తున్న అనంతపురం జిల్లాలో సీఎం హెలిపాడ్ కోసం అధికారులు ఏకంగా 10 ట్యాంకర్లు నీటిని వాడేశారు. అది కూడా హెలిపాడ్ తయారు చేయడానికి కాదు. సీఎం హెలికాప్టర్ దిగే సమయంలో దుమ్ము రేగకుండా ఉండేందుకు ఈ పనిచేశారు. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న గ్రామాల కోసం తరలిస్తున్న నీటి ట్యాంకులను అధికారులు  దారి […]

Advertisement
Update: 2016-04-22 08:24 GMT

గురువారం అనంతపురం జిల్లా హిందూపురంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో తీసుకున్న చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి. తాగేందుకు మంచినీరు కూడా లేక అలమటిస్తున్న అనంతపురం జిల్లాలో సీఎం హెలిపాడ్ కోసం అధికారులు ఏకంగా 10 ట్యాంకర్లు నీటిని వాడేశారు. అది కూడా హెలిపాడ్ తయారు చేయడానికి కాదు. సీఎం హెలికాప్టర్ దిగే సమయంలో దుమ్ము రేగకుండా ఉండేందుకు ఈ పనిచేశారు.

నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న గ్రామాల కోసం తరలిస్తున్న నీటి ట్యాంకులను అధికారులు దారి మళ్లించారు. చంద్రబాబు రాకకు ముందే పదేపదే హెలిపాడ్ దగ్గర నీటిని కుమ్మరించారు. ఫైరింజన్లలోని నీటిని వాడేశారు. చంద్రబాబు తీరుపై కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మండిపడ్డారు. తాగేందుకు నీరులేని అనంతపురం జిల్లాకు వెళ్లి అక్కడ కూడా లక్షల లీటర్ల నీటిని సీఎం వృధా చేయడం దారుణమైన అంశం అన్నారు. ఇది ఒక క్రిమినల్ చర్య అని అన్నారు. అనంత దాహార్తిని చూసి చలించిపోయి సాయిబాబా సొంతంగా వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేశారని సీఎం మాత్రం హెలిపాడ్ కోసం ఇలా మంచినీటిని నేలపాలు చేయడం క్షమించరాని నేరం అని మధు యాష్కి అన్నారు. ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి కూడా హెలిపాడ్‌ వద్ద ఇలాగే నీటిని వృధా చేయగా పెద్ద దుమారం చెలరేగింది. మన రాష్ట్రంలో మాత్రం మీడియా మనదే కాబట్టి ఇలాంటి వార్తలు జనందాకా పోవు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News