ఏడాది ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ నేత

చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నియోజవర్గానికి 2011లో జరిగిన శాసనమండలి ఎన్నికల ఫలితంపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. పదవి కాలం మరో ఏడాదిలో ముగుస్తున్న సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి న్యాయపోరాటం చేస్తున్న నరేష్ కుమార్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. లాటరీ ద్వారా నరేష్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్సీగా కోర్టు గుర్తించింది.  2011 మార్చి 21న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. వైసీపీ నుంచి దేశాయ్‌ తిప్పారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బి.నరేశ్‌కుమార్‌రెడ్డి, […]

Advertisement
Update: 2016-04-20 22:51 GMT

చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నియోజవర్గానికి 2011లో జరిగిన శాసనమండలి ఎన్నికల ఫలితంపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. పదవి కాలం మరో ఏడాదిలో ముగుస్తున్న సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి న్యాయపోరాటం చేస్తున్న నరేష్ కుమార్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. లాటరీ ద్వారా నరేష్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్సీగా కోర్టు గుర్తించింది.

2011 మార్చి 21న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. వైసీపీ నుంచి దేశాయ్‌ తిప్పారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బి.నరేశ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా మురళీధర్‌, పోటీలో నిలిచారు. ఓట్ల లెక్కింపులో తిప్పారెడ్డికి 462, నరేశ్‌కు 461 ఓట్లు పోలయ్యాయని, తిప్పారెడ్డి ఒక ఓటు తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ ఎన్నికను సవాల్‌ చేస్తూ నరేష్ హైకోర్టులో రిట్‌పిటిషన్‌ వేశారు.

కేసు విచారణ కోర్టులో నడుస్తుండగానే 2014 మేలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మదనపల్లె నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ తిప్పారెడ్డి గెలుపొందారు. మే 25న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు నరేశ్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగింది. తొలుత ఏడు ఓట్లు తిప్పారెడ్డికి ఎక్కువ వచ్చాయని రిటర్నింగ్‌ అధికారి చెప్పారని, మళ్లీ ఓట్లు లెక్కించినప్పుడు ఒక్క ఓటు ఆయనకు ఎక్కువగా వచ్చిందంటూ ఆయన ఎన్నికైనట్లు ప్రకటించేశారని నరేష్ కో్ర్టు దృష్టికి తెచ్చారు. నిజానికి తమిద్దరికీ సమంగా ఓట్లు వచ్చాయని వాదించారు.

ఈ నేపథ్యంలో కోర్టు సమక్షంలో తిరిగి ఓట్ల లెక్కింపు చేయగా… ఇద్దరికీ సమంగా ఓట్లు వచ్చాయి. దీంతో కోర్టు లాటరీ తీసింది. నరేష్ను విజయం వరించింది. దీంతో తిప్పారెడ్డి ఎన్నిక చెల్లదని, నరేష్ కుమార్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి బుధవారం ప్రకటించారు. అయితే ఎమ్మెల్సీ పదవీకాలం మరో ఏడాది మాత్రమే ఉంది. వచ్చే ఏడాది వరకు నరేష్‌ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉంటారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News