రోజా సస్పెన్షన్ పై ఇరుపక్షాలనూ తప్పుపట్టిన సుప్రీం కోర్టు

అసెంబ్లీ నుంచి రోజా ఏడాది సస్పెన్షన్ అంశంపై సుప్రీంలో విచారణ జరిగింది.  శాసనసభ ప్రజల సభ అని, అది వ్యక్తుల సభ కాదని కోర్టు వ్యాఖ్యానించింది. శాసనసభ వ్యవహారాల్లోకి కోర్టు జోక్యం చాలా సీనియస్ అంశమని… కాబట్టి  ఇరు వర్గాలు ఒక అవగాహనకు వచ్చి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే మంచిదని కోర్టు సూచించింది. శాసనసభ విశాల ప్రయోజనాల కోసం పనిచేయాలంది.  సభలో వాడిన పరుష పదజాలానికి క్షమాపణ చెప్పాలని రోజాకు సూచించింది. అదే సమయంలో రోజా క్షమాపణ […]

Advertisement
Update: 2016-04-20 05:15 GMT

అసెంబ్లీ నుంచి రోజా ఏడాది సస్పెన్షన్ అంశంపై సుప్రీంలో విచారణ జరిగింది. శాసనసభ ప్రజల సభ అని, అది వ్యక్తుల సభ కాదని కోర్టు వ్యాఖ్యానించింది. శాసనసభ వ్యవహారాల్లోకి కోర్టు జోక్యం చాలా సీనియస్ అంశమని… కాబట్టి ఇరు వర్గాలు ఒక అవగాహనకు వచ్చి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే మంచిదని కోర్టు సూచించింది. శాసనసభ విశాల ప్రయోజనాల కోసం పనిచేయాలంది. సభలో వాడిన పరుష పదజాలానికి క్షమాపణ చెప్పాలని రోజాకు సూచించింది. అదే సమయంలో రోజా క్షమాపణ చెబితే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనం సభకు సూచన చేసింది. విభజన తర్వాత ఏపీ అనేక సమస్యల్లో ఉందని వాటి పరిష్కారం వైపు దృష్టి పెట్టాలంది. శాసనసభకు సర్వాధికారులు ఉంటాయని వెల్లడించింది. లేనిపోని అపార్థాల వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటూ ఇరుపక్షాల తీరును సుప్రీం కోర్టు తప్పుపట్టింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News