పుట్టిన రోజుల్లో బాబు పుట్టిన రోజు వేరయా..?

ఎవరైనా పుట్టిన రోజు నాడు మంచి పనులు  చేయాలనుకుంటారు. గుడికి వెళ్తారు. పెద్దల ఆశ్వీస్సులు తీసుకుంటారు. పది మందికి భోజనం పెడుతారు. ఏవైనా చెడు పనులు చేయాల్సిన అనివార్యత ఉన్నా ఆ పూటకు వాయిదా వేసుకుని మంచిగా పుట్టిన రోజును గడుపుకుంటారు. ఈ జన్మను ఇచ్చిన దేవుడిని కృతజ్ఞతలు చెప్పుకుని దైవం చూపిన దారిలో నడుస్తారు. కానీ అదేంటో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. మంచి పని చేసి ప్రజలందరికీ […]

Advertisement
Update: 2016-04-19 22:04 GMT

ఎవరైనా పుట్టిన రోజు నాడు మంచి పనులు చేయాలనుకుంటారు. గుడికి వెళ్తారు. పెద్దల ఆశ్వీస్సులు తీసుకుంటారు. పది మందికి భోజనం పెడుతారు. ఏవైనా చెడు పనులు చేయాల్సిన అనివార్యత ఉన్నా ఆ పూటకు వాయిదా వేసుకుని మంచిగా పుట్టిన రోజును గడుపుకుంటారు. ఈ జన్మను ఇచ్చిన దేవుడిని కృతజ్ఞతలు చెప్పుకుని దైవం చూపిన దారిలో నడుస్తారు. కానీ అదేంటో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

మంచి పని చేసి ప్రజలందరికీ ఆదర్శప్రాయుడిగా కనీసం పుట్టిన రోజునాడైనా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక రాజ్యాంగ విరుద్ధమైన పనికి శ్రీకారం చుట్టడం ఆశ్చర్యమే. ఎదుటివాళ్లు బాధలోనే తన ఆనందం ఉందన్నట్టుగా పుట్టిన రోజు నాడే అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు పార్టీ తీర్థం ఇస్తున్నారు. బొబ్బిలి రాజులుగా కీర్తించబడిన సుజయ్‌ కృష్ణరంగారావు , ఆయన సోదరుడు బేబినాయనను తన పుట్టిన రోజు నాడే టీడీపీలోకి చేర్చుకుంటున్నారు చంద్రబాబు. ఇది…

బొబ్బిలి రాజులు తమకు తాముగా చంద్రబాబుకు సమర్పించుకున్న పుట్టిన రోజు కానుక అయి ఉండవచ్చు. కానీ ఇలా రాజ్యాంగ విరుద్దమైన పనులు చేసే ముందు, అది కూడా పుట్టిన రోజు నాడు చేసే ముందు చంద్రబాబు అయినా ఆలోచించుకోవాలి కదా?. ఒక చెడు సాంప్రదాయానికి కనీసం పుట్టిన రోజు నాడైనా విరామం ఇద్దామని ఆయన సలహాదారులైనా చెప్పి ఉండాల్సింది. అయినా రాజ్యాంగాన్ని రక్షిస్తానని ప్రమాణం చేసిన సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రే రాజ్యాంగాన్ని చెత్తకుప్పలో వేస్తుంటే ఇక ఎదురుచెప్పి సలహాలిచ్చేంత ధైర్యం ఏ సలహాదారులకు ఉంటుంది. ‘’కంచెయే నిజముగా చేను మేసినా కాదనువారెవరూ?’’ అంటూ లవకుశ సినిమాలోని పాటను పాడుకోవడం తప్పా..!. ఎనీ వే మెనీ మెనీ హ్యాపీ రిటర్స్ ఆఫ్‌ ద డే సీఎం గారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News