బయటకు బలహీనపడింది… లోన బలపడింది

మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన సీఎం చంద్రబాబు కీలకమైన నారాయణకు మాత్రం ఆఖరి ర్యాంకు కట్టబెట్టారు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే కీలకమైన రాజధాని భూసేకరణలో చక్రం తిప్పింది నారాయణే.  సీఎం తర్వాత సీఎంలాగా పేరు తెచ్చుకున్నారు. తనది మున్సిపల్ శాఖ అయినప్పటికీ… రెవెన్యూ శాఖ చేయాల్సిన భూసేకరణ పనిని నెత్తినేసుకుని చేశారు. అలాంటి నారాయణకు ఆఖరి ర్యాంకు రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ర్యాంకు రాజకీయ అవసరాల కోసం ఇచ్చినవేనని చాలా మంది భావిస్తున్నారు. ఇష్టుడైన నారాయణకు […]

Advertisement
Update: 2016-04-18 20:33 GMT

మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన సీఎం చంద్రబాబు కీలకమైన నారాయణకు మాత్రం ఆఖరి ర్యాంకు కట్టబెట్టారు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే కీలకమైన రాజధాని భూసేకరణలో చక్రం తిప్పింది నారాయణే. సీఎం తర్వాత సీఎంలాగా పేరు తెచ్చుకున్నారు. తనది మున్సిపల్ శాఖ అయినప్పటికీ… రెవెన్యూ శాఖ చేయాల్సిన భూసేకరణ పనిని నెత్తినేసుకుని చేశారు. అలాంటి నారాయణకు ఆఖరి ర్యాంకు రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ర్యాంకు రాజకీయ అవసరాల కోసం ఇచ్చినవేనని చాలా మంది భావిస్తున్నారు. ఇష్టుడైన నారాయణకు చంద్రబాబు ఇలా ఆఖరి ర్యాంకు కట్టబెట్టడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు.

ఇటీవల అత్యంత వివాదాస్పద మంత్రిగా నారాయణ పేరు తెచ్చుకున్నారు. అమరావతిలో ఏకంగా వేల ఎకరాలు నారాయణ కోనుగోలు చేశారని వార్తలు రావడం దానిపై పెద్ద దూమారం చెలరేగడం జరిగింది. ఇదంతా చంద్రబాబుకు తెలిసే జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు చంద్రబాబుకు నారాయణ బినామీగా ఉన్నారన్న విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి. సింగపూర్‌లో చంద్రబాబు ఆర్థిక లావాదేవీలను కూడా నారాయణే పర్యవేక్షిస్తున్నారని మాజీ మంత్రి శైలజనాథ్‌ లాంటి వారు కూడా పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఒక విధంగా చంద్రబాబుకు ఆత్మగా నారాయణ మారారన్న అభిప్రాయం బలపడింది. ఈ నేపథ్యంలోనే…

నారాయణను తాను ప్రత్యేకంగా చూడడం లేదని… నారాయణతో తనకు ప్రత్యేక సంబంధాలు లేవని… అందరూ మంత్రుల తరహాలోనే నారాయణను ట్రీట్ చేస్తున్నానని జనంలో భావన కలిగించేందుకే చంద్రబాబు ఇలా నారాయణకు ఆఖరి ర్యాంకు కట్టబెట్టారని భావిస్తున్నారు. ఈ విషయం నారాయణకు కూడా ముందే తెలిసి ఉంటుందని అంటున్నారు. పైకి చంద్రబాబు, నారాయణ మధ్య బంధం బలహీనపడిందన్న కలర్ ఇవ్వడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలను పలుచన చేసే యోచన ఉందని అంచనా వేస్తున్నారు. కాలేజీల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలకు లక్షలు ఫీజులు గుంజడం, కాలేజీల్లో టార్చర్ భరించలేక పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం నారాయణ కాలేజీల్లో కామనైపోయింది. విద్యావ్యవస్థ సర్వనాశనం అయిపోవడానికి కూడా నారాయణ, చైతన్యే కారణమన్నది బహిరంగ విమర్శ. చంద్రబాబు అండచూసుకునే నారాయణ రెచ్చిపోతున్నారని పలు విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు ఏకంగా 18వ ర్యాంకు కట్టెబట్టడం ద్వారా నారాయణను తాను ప్రోత్సహించడం లేదని పైకి చెప్పుకునే ప్రయత్నం చంద్రబాబు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒక వేళ చంద్రబాబు ఇచ్చిన ర్యాంకుల్లో నిజాయితీ ఉంటే అట్టర్ ప్లాఫ్ అయిన నారాయణను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాల్సి ఉంటుంది.. లేదంటే ఈ అవమాన భారంతో నారాయణే నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలి కదా!. అన్నిటికన్నా పెద్ద జోక్ ఏమిటంటే పీతల సుజాత మొదటి స్థానంలో నిలవడం. ఇలాంటి జోకులను చంద్రబాబు మాత్రమే పేల్చగలరు. అది ఆయనకే సాధ్యం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News