రోజాపై బోండా తీవ్ర వ్యాఖ్యలు... నారాయణకు మొదలైన ఓదార్పు

వైసీపీ ఎమ్మెల్యే రోజా పేరు వినబడితే చాలు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్రంగా స్పందిస్తున్నారు. టీడీపీలో మగాళ్లు లేకనే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను కొనుక్కుని తీసుకెళ్తున్నారంటూ రోజా చేసిన వ్యాఖ్యలపై బోండా స్పందించారు. టీడీపీలో మగాళ్లు ఉన్నారో లేదో రోజాకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. రోజా వేధింపులు భరించలేకే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారంటూ కొత్త లైన్ చెప్పారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ రాబోతోందని తెలుసుకున్న జగన్‌ విశాఖ వెళ్లారని విమర్శించారు. కులాలు, ప్రాంతాల […]

Advertisement
Update: 2016-04-19 04:45 GMT

వైసీపీ ఎమ్మెల్యే రోజా పేరు వినబడితే చాలు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్రంగా స్పందిస్తున్నారు. టీడీపీలో మగాళ్లు లేకనే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను కొనుక్కుని తీసుకెళ్తున్నారంటూ రోజా చేసిన వ్యాఖ్యలపై బోండా స్పందించారు. టీడీపీలో మగాళ్లు ఉన్నారో లేదో రోజాకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. రోజా వేధింపులు భరించలేకే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారంటూ కొత్త లైన్ చెప్పారు.

విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ రాబోతోందని తెలుసుకున్న జగన్‌ విశాఖ వెళ్లారని విమర్శించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని బోండా ఆరోపించారు. జగన్ కులాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూనే బోండా ఉమా మాత్రం రోజాను ఆమె కులం పేరు ప్రస్తావిస్తూ పదేపదే రోజారెడ్డి రోజారెడ్డి అని ప్రెస్ మీట్ లో సంబోధించారు. ఇలా తనను రోజా రెడ్డి అని అనడంపై రోజా ఇదివరకే అభ్యంతరం చెప్పారు. కానీ బోండా ఉమా మాత్రం ఆమె కులాన్ని టార్గెట్ చేస్తూనే మాట్లాడడం గమనార్హం.

మరోవైపు మంత్రుల జాబితాలో చివరి ర్యాంకు సొంతం చేసుకున్న మంత్రి నారాయణకు సానుభూతి తెలుపుతున్నారు టీడీపీ నేతలు. నారాయణ చాలా కష్టపడే వ్యక్తి అని మూడో ర్యాంకు సాధించిన ప్రత్తిపాటి పుల్లారావు ఓదార్చారు. నారాయణకు 18వ ర్యాంకు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నారాయణ మాత్రం తన ర్యాంకుపై పదేపదే వివరణ ఇచ్చుకుంటున్నారు. తనది చివరి ర్యాంకు కాదని చెప్పారు. తప్పులు జరిగి ఉంటే సరిదిద్దుకుంటానని చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News