అటు వైపు నుంచి నరుక్కొస్తున్న టీడీపీ నేతలు

వైసీపీ ఎమ్మెల్యే రోజాను విమర్శించాలంటే చాలా మంది టీడీపీ నేతలు తొలుత ప్రస్తావించేంది జబర్ధస్త్ కార్యక్రమాన్నే. ఈ ప్రొగ్రామ్‌లో రోజా … నాగబాబుతో కలిసి జడ్జ్‌ గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలోని డబుల్ మీనింగ్ డైలాగులు, స్క్రిప్ట్‌పై ఎప్పటి నుంచో చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమంలో జడ్జిగా పాల్గొనే రోజానా మమ్మల్ని విమర్శించేది అని టీడీపీ నేతలు ఎద్దేవాచేస్తుంటారు. బొండా ఉమా లాంటి వారు జబర్దస్త్ ఆధారంగా రోజాపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అయితే టీడీపీ […]

Advertisement
Update: 2016-04-17 10:45 GMT

వైసీపీ ఎమ్మెల్యే రోజాను విమర్శించాలంటే చాలా మంది టీడీపీ నేతలు తొలుత ప్రస్తావించేంది జబర్ధస్త్ కార్యక్రమాన్నే. ఈ ప్రొగ్రామ్‌లో రోజా … నాగబాబుతో కలిసి జడ్జ్‌ గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలోని డబుల్ మీనింగ్ డైలాగులు, స్క్రిప్ట్‌పై ఎప్పటి నుంచో చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమంలో జడ్జిగా పాల్గొనే రోజానా మమ్మల్ని విమర్శించేది అని టీడీపీ నేతలు ఎద్దేవాచేస్తుంటారు. బొండా ఉమా లాంటి వారు జబర్దస్త్ ఆధారంగా రోజాపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అయితే టీడీపీ నేతల ఎత్తు ఈ విషయంలో పారలేదు. ఎందుకంటే సదరు కార్యక్రమం ప్రసారమయ్యేది రామోజీరావుకు చెందిన ఈటీవీలో. విలువలు సాంప్రాదాయలకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పుకునే ఛానల్‌లోనే.

జబర్దస్త్‌ను తప్పుపట్టాల్సి వస్తే ఈ కార్యక్రమాన్ని రేటింగ్ కోసం ఛానల్‌లో ప్రసారం చేస్తున్న రామోజీరావునే తొలుత విమర్శించాల్సి ఉంటుంది. ఇదే పాయింట్‌ను రోజా గతంలో ఒకసారి ప్రస్తావించారు. జబర్దస్త్ కార్యక్రమం గురించి తనను విమర్శించడం మాని దమ్ముంటే వెళ్లి రామోజీనే అడగండి అని టీడీపీ నేతలకు సవాల్ చేశారు. అయితే రామోజీని నిలదీసేంత సీన్‌ ఏ టీడీపీ నేతకు ఉంటుంది?. అందుకే సైలెంట్ అయిపోయారు. అయితే ఇటీవల సదరుకార్యక్రమం నుంచి రోజాను బయటకు పంపించేందుకు టీడీపీ పెద్దలు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఎమ్మెల్యేగా కంటే రోజాకు జబర్దస్త్ ద్వారానే ఎక్కువ పేరు వస్తోందని కాబట్టి కార్యక్రమం నుంచి ఆమెను తొలగించాలని రామోజీరావుకు వినయపూర్వ విజ్ఞప్తి చేసుకున్నారట.

దీంతో ఈటీవీ యాజమాన్యం కూడా ఆ దిశగానే ఆలోచిస్తోందని చెబుతున్నారు. రోజా ప్లేస్‌లో ఇద్దరు మాజీ హీరోయిన్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇక్కడ విచిత్రం ఏమిటంటే… జనాన్ని డబుల్ మీనింగ్ డైలాగులతో వేధిస్తున్న జబర్దస్త్ కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందిగా కోరాల్సింది పోయి… ఈ కార్యక్రమంలో జస్ట్ జడ్జిగా వ్యవహరిస్తున్న రోజాను తొలగించాలని టీడీపీ నేతలు కోరడటమే. నిజంగా సమాజం పట్ల బాధ్యత ఉంటే కార్యక్రమాన్ని ఆపేయాలని కోరాలి. రామోజీరావు కూడా ఆలోచన చేయాల్సి వస్తే రోజాను తొలగించాలని కార్యక్రమ నిర్వాహకులను గైడ్ చేయడం కాకుండా… తన ఛానల్‌లోని సదరు కార్యక్రమానికే మంగళం పాడితే బాధ్యతగా ఉంటుందని అభిప్రాయం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News