"జగన్ సరైనోడు అయితే... మాకెందుకీ పరిస్థితి"..?

”జగన్ సరైనోడు అయితే మాకెందుకీ పరిస్థితి”. ఇది ఏ వైసీపీ నేత మాటలో కావు. కాలం కలిసి రాక టీడీపీలో కాలం వెల్లదీస్తున్న రాయలసీమకు చెందిన ఒక సీనియర్ లీడర్ ఆవేదన. దేనినైనా ధైర్యంగా బయటకు చెప్పే ఈ ఇద్దరు సోదరులు తమను కలిసిన వారి వద్ద చెప్పే మాటలివి. ఒకప్పుడు కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన బ్రదర్స్‌ ఇద్దరూ ఇప్పుడు కూడా ఎక్కడా తగ్గడం లేదు. అయితే మొన్నటి ఎన్నికల ముందు కాంగ్రెస్ పతనం అయిపోవడంతో గత్యంతరం […]

Advertisement
Update: 2016-04-17 08:45 GMT

”జగన్ సరైనోడు అయితే మాకెందుకీ పరిస్థితి”. ఇది ఏ వైసీపీ నేత మాటలో కావు. కాలం కలిసి రాక టీడీపీలో కాలం వెల్లదీస్తున్న రాయలసీమకు చెందిన ఒక సీనియర్ లీడర్ ఆవేదన. దేనినైనా ధైర్యంగా బయటకు చెప్పే ఈ ఇద్దరు సోదరులు తమను కలిసిన వారి వద్ద చెప్పే మాటలివి. ఒకప్పుడు కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన బ్రదర్స్‌ ఇద్దరూ ఇప్పుడు కూడా ఎక్కడా తగ్గడం లేదు. అయితే మొన్నటి ఎన్నికల ముందు కాంగ్రెస్ పతనం అయిపోవడంతో గత్యంతరం లేక టీడీపీలో చేరారు.

నిజానికి వారు వైసీపీలోకి రావడానికి గట్టిగా ప్రయత్నించారట. అయితే ఈ బ్రదర్స్ వస్తే జిల్లాలో పార్టీపై పట్టుఉండదంటూ కొందరు జగన్‌కు నూరిపోశారట. అందుకే ఆ అన్నదమ్ములకు జగన్‌ తలుపులు తెరవలేదని చెబుతుంటారు. దీంతో ఆఖరుకు బద్దశత్రువు లాంటి టీడీపీలో చేరిపోయారు. ఎన్నికల్లో తమ సత్తా ఏంటో కూడా చూపించారు. వైసీపీకి కోలుకోలేని దెబ్బపడింది సదరు జిల్లాలో. ఎన్నికల సమయంలో చాలా మంది టీడీపీ అభ్యర్థులకు ఆ సోదరులు ఆర్థికంగా పెద్దెత్తున సాయం చేశారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత తమ ఆర్థిక సాయంతోనే గెలిచిన వారు తమకే ఎదురు తిరగడం చూసి వారు తట్టుకోలేకపోతున్నారట.

పైగా.. ఎన్నికల ముందు వరకు చీలికలుగా ఉన్న టీడీపీ నేతలు గెలిచిన తరువాత సామాజిక వర్గపరంగా అందరూ ఒక్కటైపోయారు. జిల్లాలో ఆ బ్రదర్స్‌ హవా లేకుండా చేయాలని శతవిధాలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయినా బ్రదర్స్ ఎక్కడా తగ్గడం లేదు. తమను కలిసిన కార్యకర్తలు, నేతలు… ”ఈ పార్టీ మనకు సరైన వేదిక కాదు అన్నా” అన్నప్పుడు మాత్రం ఒక్కోసారి ఓపెన్ అయిపోతున్నారట. ”మన వాడు(జగన్) సరైనోడు అయితే మాకు ఈ పరిస్థితి ఎందుకుంటుంది” అనిప్రశ్నిస్తున్నారు. ”అయినా మమ్మల్ని దూరం పెట్టి ఆయన కూడా ఏం సాధించాడు” అని అంటున్నారట. ఇది వారి అభిప్రాయమే కాదు. సదరు జిల్లాలోనూ చాలా మంది వైసీపీ కార్యకర్తల భావన కూడా అదే . సదరు నాయకులను పార్టీలోకి తీసుకొని ఉంటే జిల్లాలో ఇంకో ఐదారు సీట్లు పెరిగేవని అంటున్నారు. అనవసరంగా వారిని పార్టీలోకి రాకుండా చేసుకుని ఇంకా రెచ్చగొట్టినట్టు అయిందంటున్నారు. జగన్‌ చుట్టూ చేరిన కొందరు స్వార్థపరులు ఇలా పార్టీ గెలుపుతో సంబంధం లేకుండా వ్యక్తిగత రాజకీయాలు నడిపి పరిస్థితిని తారుమారు చేశారని ఆవేదన చెందుతున్నారు.

 

Tags:    
Advertisement

Similar News