మంత్రి సింగపూర్ టూర్‌ అందుకు కాదా?... జగన్‌కు ఆ అర్హత లేదట!

చంద్రబాబు పాలన తీరుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్‌ మండిపడ్డారు. చంద్రబాబు పాలన గాడి తప్పిందన్నారు. ఈ విషయాన్ని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయన్నారు.  టీడీపీ నేతలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమసంపాదన లావాదేవీలను మంత్రి నారాయణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అక్రమ సంపాదన లావాదేవీలను నిర్వహించేందుకే మంత్రి నారాయణ సింగపూర్‌ వెళ్తున్నారని ఆరోపించారు. అవినీతి మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సొంతపొలంలో ఎర్రచందనం దుంగలు […]

Advertisement
Update: 2016-04-15 08:18 GMT

చంద్రబాబు పాలన తీరుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్‌ మండిపడ్డారు. చంద్రబాబు పాలన గాడి తప్పిందన్నారు. ఈ విషయాన్ని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయన్నారు. టీడీపీ నేతలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమసంపాదన లావాదేవీలను మంత్రి నారాయణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు అక్రమ సంపాదన లావాదేవీలను నిర్వహించేందుకే మంత్రి నారాయణ సింగపూర్‌ వెళ్తున్నారని ఆరోపించారు. అవినీతి మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సొంతపొలంలో ఎర్రచందనం దుంగలు బయటపడడంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సన్నిహితులే ఆయన పొలంలో ఎర్రచందనం దుంగలను డంప్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయంటూ పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో శైలజానాథ్ ఈ విధంగా స్పందించారు.

మరోవైపు చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఫిరాయింపులపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు. ఫిరాయింపులను వైఎస్ ప్రోత్సహించారని అన్నారు. అంటే వైఎస్‌ తప్పు చేసి ఉంటే ఆ తప్పును టీడీపీ నేతలు కూడా చేస్తారన్న మాట.

అటు ఇటీవల టీడీపీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో కర్నూలు-గుంటూరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నంద్యాలలో దళితులు తమకు అంబేద్కర్ భవన్‌ను కట్టించవలసిందిగా భూమానాగిరెడ్డిని కోరగా. … ‘ మీకు తినడానికి తిండి లేదు కానీ అంబేద్కర్ భవన్ అంత అవసరమా’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కులవివక్ష పోరాట సమితి నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News