అట్టర్ ఫ్లాప్ అని అంగీకరించిన పవన్

భారీ అంచనాల మధ్య విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా… మొదటి రోజు మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ లో కూడా వసూళ్లు తగ్గిపోవడంతో, స్వయంగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగాడు. సినిమాకు మరోసారి తనవంతుగా ప్రమోషన్ కల్పించే ప్రయత్నం చేశాడు. ప్రచారానికే దూరంగా ఉండే పవన్, సర్దార్ సినిమా కోసం రెండోసారి మీడియా మొత్తానికి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇంత చేసినా సర్దార్ ను కాపాడ్డం ఎవరి తరం కాలేదు. దీంతో ఆ […]

Advertisement
Update: 2016-04-13 22:46 GMT
భారీ అంచనాల మధ్య విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా… మొదటి రోజు మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ లో కూడా వసూళ్లు తగ్గిపోవడంతో, స్వయంగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగాడు. సినిమాకు మరోసారి తనవంతుగా ప్రమోషన్ కల్పించే ప్రయత్నం చేశాడు. ప్రచారానికే దూరంగా ఉండే పవన్, సర్దార్ సినిమా కోసం రెండోసారి మీడియా మొత్తానికి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇంత చేసినా సర్దార్ ను కాపాడ్డం ఎవరి తరం కాలేదు. దీంతో ఆ సినిమా ఫ్లాప్ అనే విషయాన్ని పవన్ ఒప్పుకున్నాడు. చాలా రోజులు తీసిన సినిమా కోసం నిర్మాత శరత్ మరార్… చాలా ఖర్చుపెట్టాడని, అయితే ఆఖరి నిమిషంలో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని…. వాళ్లకు తక్కువ రేటుకే సినిమాను అమ్మాడని పవన్ అన్నాడు.
అలా నష్టాల్లో కూరుకుపోయిన శరత్ మరార్ కోసం మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు పవన్. ఈ నెలాఖరుకు ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఓ కొత్త సినిమా ప్రారంభించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తిచేసి, లోబడ్జెట్ లో సినిమాను ముగించి…. నిర్మాతకు ఎక్కువ లాభాలు తీసుకొచ్చేలా పవన్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో పవన్ ఎప్పుడూ ఇంత తొందరగా మరో సినిమా ప్రారంభించలేదు. అలాంటిదే ఒకే ఏడాదిలో రెండు సినిమాలు చేస్తున్నాడంటే… ఏదో ఒక పెద్ద కారణమే ఉండి ఉంటుందని అంతా భావించారు. ఆ కారణమేంటో ఇప్పుడు అందరికీ తెలిసొచ్చింది.
Tags:    
Advertisement

Similar News