పురంలో బాలయ్య వేయాలట… బెజవాడలో సుజాత మనస్తాపం

అంబేద్కర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అన్ని పార్టీల నేతలు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. హిందూపురంలో టీడీపీ నేతలు అత్యుత్సహం ప్రదర్శించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నవీన్‌ నిశ్చల్‌ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.  అంబేద్కర్ విగ్రహానికి బాలకృష్ణ పూలమాల వేసిన తర్వాతే మిగిలిన వారు వేయాలని అడ్డుతగిలారు. ఈ సమయంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అటు విజయవాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో […]

Advertisement
Update: 2016-04-14 00:46 GMT

అంబేద్కర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అన్ని పార్టీల నేతలు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. హిందూపురంలో టీడీపీ నేతలు అత్యుత్సహం ప్రదర్శించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నవీన్‌ నిశ్చల్‌ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి బాలకృష్ణ పూలమాల వేసిన తర్వాతే మిగిలిన వారు వేయాలని అడ్డుతగిలారు. ఈ సమయంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

అటు విజయవాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో దళిత మంత్రి పీతల సుజాత మనస్తాపం చెందారు. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి ఫొటో లేదు. దీంతో సుజాత బాధపడ్డారు. దళిత మంత్రికి అంబేద్కర్ జయంతి రోజున ఇచ్చే గౌరవం ఇదేనా అని సన్నిహితుల దగ్గర వాపోయారు. ఇటీవల జరిగిన జగ్జీవన్‌రాం జయంతి వేడుకల సమయంలోనూ ఇదే తరహాలోనే తనను అవమానించారని ఆమె ఆవేదన చెందారు.

Click on Image to Read:


Tags:    
Advertisement

Similar News