ఈ ఏడాదిలోనే పవన్ నుంచి మరో  సినిమా

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో… అభిమానులంతా నిరాశతో కూరుకుపోయారు. వాళ్లలో ఉత్సాహాన్ని తిరిగి నింపేందుకు పవన్ కల్యాణ్ ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఏడాదికి ఒక సినిమా తీయడమే గగనమనుకుంటుంటే… ఈ ఏడాది అభిమానుల కోసం ఇంకో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించాడట పవన్. తనకు ఖుషి లాంటి సూపర్ హిట్, కొమరం పులి లాంటి అట్టర్ ఫ్లాపు ఇచ్చిన దర్శకుడు ఎస్ జే సూర్యతో మరోసారి కలిసి సెట్స్ పైకి వెళ్లాలని ఫిక్స్ […]

Advertisement
Update: 2016-04-11 02:54 GMT
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో… అభిమానులంతా నిరాశతో కూరుకుపోయారు. వాళ్లలో ఉత్సాహాన్ని తిరిగి నింపేందుకు పవన్ కల్యాణ్ ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఏడాదికి ఒక సినిమా తీయడమే గగనమనుకుంటుంటే… ఈ ఏడాది అభిమానుల కోసం ఇంకో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించాడట పవన్. తనకు ఖుషి లాంటి సూపర్ హిట్, కొమరం పులి లాంటి అట్టర్ ఫ్లాపు ఇచ్చిన దర్శకుడు ఎస్ జే సూర్యతో మరోసారి కలిసి సెట్స్ పైకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈనెల 29న ఉండవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టుకు నిర్మాత ఎవరు… హీరోయిన్ ఎవరనే విషయాల్ని త్వరలోనే కన్ ఫర్మ్ చేస్తారు. ఈ సినిమాను రికార్డు స్థాయిలో పూర్తిచేసి… అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.
Tags:    
Advertisement

Similar News