సుజనాకు అరెస్ట్‌ వారెంట్‌

టీడీపీ కేంద్రమంత్రి సుజనా చౌదరికి నాంపల్లి హైకోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. మారిషస్‌ బ్యాంకుకు తిరిగి అప్పు చెల్లించని కేసులో ఈ వారెంట్‌ని జారీచేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకాకుండా వరుసగా మూడు సార్లు కేంద్రమంత్రి డుమ్మా కొట్టారు. ఆయన తరుపు న్యాయవాది పదేపదే సుజనాచౌదరి హాజరుకాకుండా మినహాయింపు కోరుతూ వచ్చారు. అయితే పదేపదే ఇలా చేయడంపై కోర్టు మండిపడినది. అరెస్టు వారెంట్‌ జారీచేశారు. ఈ కేసు విచారణ సుప్రీం వరకు వెళ్లింది. సుజనా గ్రూప్‌ […]

Advertisement
Update: 2016-04-07 07:28 GMT

టీడీపీ కేంద్రమంత్రి సుజనా చౌదరికి నాంపల్లి హైకోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. మారిషస్‌ బ్యాంకుకు తిరిగి అప్పు చెల్లించని కేసులో ఈ వారెంట్‌ని జారీచేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకాకుండా వరుసగా మూడు సార్లు కేంద్రమంత్రి డుమ్మా కొట్టారు. ఆయన తరుపు న్యాయవాది పదేపదే సుజనాచౌదరి హాజరుకాకుండా మినహాయింపు కోరుతూ వచ్చారు. అయితే పదేపదే ఇలా చేయడంపై కోర్టు మండిపడినది. అరెస్టు వారెంట్‌ జారీచేశారు. ఈ కేసు విచారణ సుప్రీం వరకు వెళ్లింది. సుజనా గ్రూప్‌ సంస్థల అధినేత అయిన సుజనా చౌదరి మారిషస్‌ బ్యాంకుకు 106 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వుంది. కానీ సుజనా ఆ పని చేయలేదు. దీంతో సదరు బ్యాంకు కోర్టులను ఆశ్రయించింది. తదుపరి కేసు విచారణ ఏప్రిల్‌ 26కు వాయిదా పడింది.

Click on Image to Read:

Advertisement

Similar News