కృష్ణాజిల్లాలోనే రంగప్రవేశం ఆలోచన వెనుక!

లోకేష్ తన తండ్రి సొంత ప్రాంతమైన చిత్తూరు జిల్లా లేదా రాయలసీమ నుంచి కాకుండా కృష్ణాజిల్లా నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయించేందుకు జరుగుతున్న ప్రయత్నాల వెనుక భారీ భవిష్యత్తు వ్యూహమే ఉన్నట్టుగా భావిస్తున్నారు. తండ్రి ప్రాంతం నుంచి కాకుండా తల్లి భువనేశ్వరి, తాత ఎన్టీఆర్ సొంత జిల్లాపై దృష్టి పెట్టడం వెనుక కొన్ని కారణాలున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ కమ్మ సామాజికవర్గం చేతిలో ఉంది. అదే సమయంలో సీఎంగా రాయలసీమకు చెందిన చంద్రబాబు ఉన్నా తెర […]

Advertisement
Update: 2016-04-07 09:06 GMT

లోకేష్ తన తండ్రి సొంత ప్రాంతమైన చిత్తూరు జిల్లా లేదా రాయలసీమ నుంచి కాకుండా కృష్ణాజిల్లా నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయించేందుకు జరుగుతున్న ప్రయత్నాల వెనుక భారీ భవిష్యత్తు వ్యూహమే ఉన్నట్టుగా భావిస్తున్నారు. తండ్రి ప్రాంతం నుంచి కాకుండా తల్లి భువనేశ్వరి, తాత ఎన్టీఆర్ సొంత జిల్లాపై దృష్టి పెట్టడం వెనుక కొన్ని కారణాలున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ కమ్మ సామాజికవర్గం చేతిలో ఉంది. అదే సమయంలో సీఎంగా రాయలసీమకు చెందిన చంద్రబాబు ఉన్నా తెర వెనుక చక్రం తిప్పుతున్నది,… పార్టీని నడిపిస్తున్నది కృష్ణా జిల్లా కమ్మ నేతలే.

కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కమ్మ వర్గీయుల మద్దతు లేకుండా టీడీపీ నాయకత్వం చేపట్టడం దాదాపు అసాధ్యం. అందుకే ఈ రెండు జిల్లాలకు చెందిన సదరు సామాజికవర్గం నేతలను మచ్చిక చేసుకుని ఇంతకాలం చంద్రబాబు రాజకీయం నడిపారు. ఇప్పుడు కొడుకును కూడా కృష్ణా జిల్లా నుంచే రాజకీయ ఆరంగేట్రం చేయించడం ద్వారా రాయలసీమవాడు అన్న ముద్ర పొగొట్టి … లోకేష్ తమ ప్రాంతం వాడు అన్న భావన కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సదరు సామాజికవర్గంలో కల్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

ఇప్పటికే లోకేష్ కూడా తండ్రి గ్రామాన్ని కాకుండా తాతకు చెందిన నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఒక విధంగా ఎన్టీఆర్ వారసుడు లోకేషే అన్న భావన కల్పించి భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారికి చెక్ పెట్టే ఎత్తుగడ కూడా ఉందంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News