రాయల్‌ మర్డర్ వెనుక ప్రముఖ హీరో ఫ్యాన్స్ అధ్యక్షుడు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ప్రముఖ న్యాయవాది టీడీ రాయల్ హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.  హత్యలో మొత్తం నలుగురు పాల్గొన్నారు.  వారిలో ఒకరిని హత్యస్థలిలోనే స్థానికులు పట్టుకున్నారు. మరో ముగ్గురు పారిపోయారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పట్టణంలోని ఏసీ పరికరాల షాపులో టీడీ రాయల్ ఉన్న సమయంలో దుండగులు వచ్చారు. షాపు తలుపులు మూసేసి వేటకొడవళ్లతో  దారుణంగా నరికి చంపారు. అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. హత్య పట్టణంలో సంచలనం సృష్టించడంతో […]

Advertisement
Update: 2016-04-04 05:45 GMT

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ప్రముఖ న్యాయవాది టీడీ రాయల్ హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్యలో మొత్తం నలుగురు పాల్గొన్నారు. వారిలో ఒకరిని హత్యస్థలిలోనే స్థానికులు పట్టుకున్నారు. మరో ముగ్గురు పారిపోయారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పట్టణంలోని ఏసీ పరికరాల షాపులో టీడీ రాయల్ ఉన్న సమయంలో దుండగులు వచ్చారు. షాపు తలుపులు మూసేసి వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. హత్య పట్టణంలో సంచలనం సృష్టించడంతో పోలీసులు వెంటనేరంగంలోకి దిగారు.

ఈ హత్య వెనుక అసలు సూత్రధారి ప్రభు అనే వ్యక్తిగా గుర్తించారు. ఇతడు ఒక ప్రముఖ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్నట్టు పోలీసులు ధృవీకరించారు. ప్రభు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడితో పాటు అతడి స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, సెటిల్‌మెంట్లే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. చనిపోయిన రాయల్ కోట్లాది రూపాయల సెటిల్మెంట్లు చేసినట్టు చెబుతున్నారు . అయితే ఇటీవల జిల్లాలో నేరాల సంఖ్య పెరగడంపై సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News