బాబు పాలన అద్భుతంగా ఏమీ లేదన్న నెహ్రు

వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరేందుకు సిద్ధమైన జ్యోతుల నెహ్రు… తాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతానని చెప్పారు. ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జ్యోతుల నెహ్రు… తన సామాజికవర్గానికి చెందిన చిరంజీవి సీఎం అవుతారన్న ఆశతోనే ప్రజారాజ్యంలోకి వెళ్లానని చెప్పారు. అందులో తప్పుపట్టాల్సిందేమీ లేదన్నారు. సాంప్రదాయ రాజకీయాల్లో ఎవరైనా గెలుపునే ప్రతిపాదికగా తీసుకుంటారన్నారు. చంద్రబాబు పరిపాలనపైనా నెహ్రు కామెంట్స్ చేశారు. చంద్రబాబు పరిపాలన అద్భుతంగా ఉందని మాత్రం తాను చెప్పనని అన్నారు. మరి పాలన […]

Advertisement
Update: 2016-04-04 00:00 GMT

వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరేందుకు సిద్ధమైన జ్యోతుల నెహ్రు… తాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతానని చెప్పారు. ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జ్యోతుల నెహ్రు… తన సామాజికవర్గానికి చెందిన చిరంజీవి సీఎం అవుతారన్న ఆశతోనే ప్రజారాజ్యంలోకి వెళ్లానని చెప్పారు. అందులో తప్పుపట్టాల్సిందేమీ లేదన్నారు. సాంప్రదాయ రాజకీయాల్లో ఎవరైనా గెలుపునే ప్రతిపాదికగా తీసుకుంటారన్నారు.

చంద్రబాబు పరిపాలనపైనా నెహ్రు కామెంట్స్ చేశారు. చంద్రబాబు పరిపాలన అద్భుతంగా ఉందని మాత్రం తాను చెప్పనని అన్నారు. మరి పాలన అద్భుతంగా లేనప్పుడు టీడీపీలోకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించగా… తానె వెళ్లి అద్భుతాలు చేద్దామనుకుంటున్నానని అన్నారు. వైసీపీలో తాను నెంబర్‌ టూ కాదని చెప్పారు. వైసీపీలో నెంబర్‌ టూ, త్రీ అంటూ ఏమీ ఉండదన్నారు. వైసీపీలో నెంబర్‌ వన్ మాత్రమే ఉంటుదని చెప్పారు. ఎదుటి పార్టీ వారు ఏ స్థాయిలో విమర్శలు చేసినా తట్టుకునే సామర్థ్యం జగన్‌కు ఉందని.. కానీ సొంతపార్టీ వారు విమర్శిస్తే మాత్రం తట్టుకోలేరని అన్నారు.

వైసీపీలో ఉంటూ టీడీపీపై చేసిన విమర్శలను తన సొంత అభిప్రాయంగా భావించవద్దని కోరారు. చంద్రబాబు తప్పు చేసినా తిడుతానని చెప్పారు. గతంలో ఇలాంటి మనస్తత్వం వల్లే చంద్రబాబు వద్ద ఇబ్బందులు ఎదుర్కొని టీడీపీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని చంద్రబాబు హామీ ఇవ్వడం వల్లే టీడీపీలోకి వెళ్తున్నానని చెప్పారు. పార్టీలు మారడం ఇదే చివరిసారి అని అనుకుందాం అని వ్యాఖ్యానించారు. జగన్‌కు పరిపక్వత లేదని నెహ్రు వ్యాఖ్యానించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News