రోజా కులాన్ని వదిలిపెట్టని బోండా

ఏపీ అసెంబ్లీని అగ్రిగోల్డ్ అంశం కుదిపేసింది.  సభ ప్రారంభంకాగానే అగ్రిగోల్డ్‌పై చర్చకు వైసీపీ పట్టుపట్టింది. 42లక్షల మంది ఖాతాదారులకు సంబంధించిన అంశమని వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అగ్రిగోల్డ్‌పై చర్చ చేపట్టేందుకు నిరాకరించింది. దీంతో విపక్ష సభ్యులు పోడియం వద్ద బైఠాయించారు. నినాదాలు చేశారు. ఈ అంశంపై సభ రెండుసార్లు వాయిదా పడింది.  విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలో అధికారపార్టీ సభ్యులు  ఎప్పటిలాగే  మైకులు తీసుకుని ఎదురుదాడి […]

Advertisement
Update: 2016-03-28 01:44 GMT

ఏపీ అసెంబ్లీని అగ్రిగోల్డ్ అంశం కుదిపేసింది. సభ ప్రారంభంకాగానే అగ్రిగోల్డ్‌పై చర్చకు వైసీపీ పట్టుపట్టింది. 42లక్షల మంది ఖాతాదారులకు సంబంధించిన అంశమని వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అగ్రిగోల్డ్‌పై చర్చ చేపట్టేందుకు నిరాకరించింది. దీంతో విపక్ష సభ్యులు పోడియం వద్ద బైఠాయించారు. నినాదాలు చేశారు. ఈ అంశంపై సభ రెండుసార్లు వాయిదా పడింది. విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలో అధికారపార్టీ సభ్యులు ఎప్పటిలాగే మైకులు తీసుకుని ఎదురుదాడి చేశారు.

వైసీపీ తీరు కుక్క తోక వంకర అన్నట్టుగా ఉందని గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. వీరి తీరు చూసి జనం అసహ్యించుకుంటున్నారని అన్నారు. వెంటనే ఆందోళన చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

టీడీపీ ఎమ్మెల్యే బోండా కూడా పదేపదే విపక్షంలో తీవ్ర ఆరోపణలు చేశారు. బోండా ఉమ రెండు సార్లు మాట్లాడగా… రెండుసార్లు రోజా అంశాన్ని ప్రస్తావించారు. రోజా అని కాకుండా రోజా రెడ్డి .. రోజా రెడ్డి అంటూ ఆమె కులాన్ని హైలైట్ చేస్తూ పదేపదే మాట్లాడారు. రోజారెడ్డి కోసం నాలుగు రోజులు సభాసమయాన్ని వృధా చేశారని విమర్శించారు. రెండు రోజుల క్రితం ప్రెస్‌ మీట్ పెట్టిన రోజా… తనను రోజా రెడ్డి అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రికార్డుల్లోనూ తన పేరు చివర రెడ్డి లేదని అలాంటప్పుడు పదేపదే టీడీపీ నేతలు రోజారెడ్డి అని ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రతి విషయానికి కులం రంగు ఎందుకు పులుముతారని ఆమె ప్రశ్నించారు. అయినా సరే బోండా ఉమ మాత్రం రోజాను ఆమె కులంపేరుతోనే పిలువడం గమనార్హం. బహుషా రెడ్డి సామాజికవర్గాన్ని టార్గెట్ చేసేందుకు బోండా ఉమను టీడీపీ వాడుకుంటోందా అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే రోజా అభ్యంతరం చేసిన తర్వాత కూడా ఇలా రోజారెడ్డి అని పిలవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

పార్టీ వీడివెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఇలా అగ్రిగోల్డ్ అంశాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందని మరో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మండిపడ్డారు. చివరకు ప్రతిపక్షం ఆందోళన నేపథ్యంలో అగ్రిగోల్డ్‌పై సాయంత్రం చర్చకు ప్రభుత్వం అంగీకరించింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News