విప్ వివాదం... సాక్షి జర్నలిస్టులను కొట్టిన జంపింగ్ ఎమ్మెల్యే, ఆస్పత్రికి తరలింపు

విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మరోసారి రెచ్చిపోయారు. సాక్షి ఫోటో, వీడియో జర్నలిస్టులపై అనుచరులతో కలిసి దాడి చేశారు. దాడిలో జర్నలిస్టులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వైసీపీ నుంచి గెలిచి ఇటీవల టీడీపీలో చేరిన జలీల్‌ఖాన్‌కు ద్రవ్యవినిమయ బిల్లు ఓటింగ్ అంశంలో విప్‌ జారీ చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. విప్‌ అందజేసేందుకు వెళ్తున్నట్టు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ వార్తను కవర్ చేసేందుకు సాక్షి జర్నలిస్టులు అక్కడికి వెళ్లారు.  విప్‌ తీసుకున్నట్టుగా ఫోటోలు, వీడియో దృశ్యాలు […]

Advertisement
Update: 2016-03-27 07:59 GMT

విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మరోసారి రెచ్చిపోయారు. సాక్షి ఫోటో, వీడియో జర్నలిస్టులపై అనుచరులతో కలిసి దాడి చేశారు. దాడిలో జర్నలిస్టులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వైసీపీ నుంచి గెలిచి ఇటీవల టీడీపీలో చేరిన జలీల్‌ఖాన్‌కు ద్రవ్యవినిమయ బిల్లు ఓటింగ్ అంశంలో విప్‌ జారీ చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు.

విప్‌ అందజేసేందుకు వెళ్తున్నట్టు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ వార్తను కవర్ చేసేందుకు సాక్షి జర్నలిస్టులు అక్కడికి వెళ్లారు. విప్‌ తీసుకున్నట్టుగా ఫోటోలు, వీడియో దృశ్యాలు రికార్డు అయితే భవిష్యత్తులో ఇరుక్కుంటామని భావించిన జలీల్‌ఖాన్ జర్నలిస్టులపై రెచ్చిపోయారు. విజువల్స్‌ రికార్డు చేయవద్దంటూ దాడి చేసి కొట్టారు. దాడి చేయడంపై విజయవాడ వన్‌ టౌన్ పీఎస్‌లో జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి.

కొద్ది రోజుల క్రితం కూడా జలీల్‌ఖాన్ కుమారుడు ఒక వ్యక్తిని బలవంతంగా కారులో తీసుకెళ్తున్నారన్న సమాచారం రావడంతో ఒక విలేకరి వెళ్లి ఆ దృశ్యాలను ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే కుమారుడు, అతడి అనుచరులు కలిసి విలేకరిని కొట్టారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News