మాజీ జేడీకి బాబు మీడియా ఉచిత ప్రచారం వెనుక...

జేడీ లక్ష్మినారాయణ. సీబీఐ మాజీ జేడీ. మంచి అధికారియే అయిఉండవచ్చు. కానీ ఆయన కంటే నిజాయితీపరులు, సీనియర్ అధికారులు రాష్ట్రంలో, దేశంలో చాలా మంది ఉన్నారు. కానీ ఏపీలోని ఒక వర్గం మీడియా మాత్రం లక్ష్మినారాయణకు ఇస్తున్న ప్రచారం అంతాఇంతా కాదు. ఆయన ఏ గుడికి వెళ్లినా, ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ ఒకవర్గం చానళ్ల కెమెరాలు వాలిపోతున్నాయి. జిల్లా పర్యటనలకు వచ్చిన మంత్రుల కవరేజ్‌నైనా మిస్‌ అవుతారేమో గానీ లక్ష్మినారాయణ కార్యక్రమం కవరేజ్ మాత్రం మిస్ […]

Advertisement
Update: 2016-03-22 05:03 GMT

జేడీ లక్ష్మినారాయణ. సీబీఐ మాజీ జేడీ. మంచి అధికారియే అయిఉండవచ్చు. కానీ ఆయన కంటే నిజాయితీపరులు, సీనియర్ అధికారులు రాష్ట్రంలో, దేశంలో చాలా మంది ఉన్నారు. కానీ ఏపీలోని ఒక వర్గం మీడియా మాత్రం లక్ష్మినారాయణకు ఇస్తున్న ప్రచారం అంతాఇంతా కాదు. ఆయన ఏ గుడికి వెళ్లినా, ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ ఒకవర్గం చానళ్ల కెమెరాలు వాలిపోతున్నాయి. జిల్లా పర్యటనలకు వచ్చిన మంత్రుల కవరేజ్‌నైనా మిస్‌ అవుతారేమో గానీ లక్ష్మినారాయణ కార్యక్రమం కవరేజ్ మాత్రం మిస్ అవరు.

సరే జగన్‌ ఆస్తుల కేసు విచారణ సమయంలో అయితే అర్థం చేసుకోవచ్చు. టీవీల్లో చూపించి మరింత ఉత్సాహం పరుస్తున్నారని భావించవచ్చు. కానీ ఇప్పుడు ఆయన మహారాషకు బదిలీ అయి వెళ్లారు. అయినా సరే లక్ష్మీనారాయణ ఎప్పుడైనా ఏపీకి వస్తే చాలు ఫ్రీగానే ప్రచారం కల్పిస్తున్నారు. అయితే ఇదంతా లక్ష్మినారాయణ ప్రమేయం లేకుండా జరుగుతున్నదే. మీడియా అత్యుత్సాహంతో జరుగుతున్నదే. ఇలా టీడీపీ అనుకూల మీడియా వ్యవహరించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. జగన్‌ను డామేజ్‌ చేసేందుకే ఈ ఎత్తు. ఎలా అంటే లక్ష్మినారాయణకు విపరీతమైన ప్రచారం కల్పించి, ఆయన్ను ఒక గొప్ప వ్యక్తి అన్న భావనను సమాజంలో కల్పిస్తే అప్పుడు ఆయన హీరో అవుతారు.

లక్ష్మీనారాయణ మంచివాడు కాబట్టి నిజాయితీ పరుడు కాబట్టి, హీరో కాబట్టి… అదే సమయంలో జగన్‌ చెడ్డవాడు, అవినీతిపరుడు, విలన్ అన్న భావన ప్రజల్లో కలిగించేందుకు ఈ ఎత్తుగడ అని చెబుతుంటారు. అంటే లక్ష్మీనారాయణను హీరోను చేస్తే ఆయన హయాంలో సీబీఐ విచారణ ఎదుర్కొన్న జగన్‌ విలన్ అవుతారన్న మాట. ఇదీ టీడీపీ మీడియా లెక్క. అందుకే జగన్‌ కేసు దర్యాప్తు పూర్తయి చాలా కాలమైనా, లక్ష్మీనారాయణ మహారాష్ట్రకు బదిలీ అయిన ఏళ్లు గడుస్తున్నా టీడీపీ మీడియాలో ఆయనకు ప్రచారం మాత్రం తగ్గడం లేదు. అలా లక్ష్మినారాయణ ప్రమేయం లేకుండానే టీడీపీ మీడియా ఆయన్ను బాగానే వాడుకుంటోంది. చంద్రబాబుపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన సమయంలోనూ సీబీఐ జేడీగా ఉన్నది లక్మీనారాయణే. కానీ సిబ్బంది లేరంటూ దాడులు నిర్వహించకుండా వారంపాటు గడిపేశారు. అంతలోనే చంద్రబాబు కోర్టులకు వెళ్లి విచారణపై స్టే తెచ్చుకున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News