ఎమ్మెల్యే పదవి మినహా... అన్నీ...

అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తన నివేదికను సభముందుంచింది.  రోజా విషయంలో కఠినంగానే వ్యవహరించాలని కమిటీ సూచించింది.  రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేయాలని సిపార్సు చేసింది. ఎమ్మెల్యే అలవెన్స్‌లు కూడా నిలిపివేయాలని ప్రతిపాదించింది. కొడాలి నానిపైనా చర్యలు తీసుకోవాలని సభకు కమిటీ సిపార్సు చేసింది. జ్యోతుల నెహ్రు, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి,  చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి క్షమాపణలు చెప్పినందున మందలించి వదిలేయాలని సూచించింది. కొడాలి నాని కూడా క్షమాపణ చెప్పినప్పటికీ కమిటీ చర్యలకే సిపార్సు చేసింది. నాలుగు సార్లు […]

Advertisement
Update: 2016-03-21 00:21 GMT

అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తన నివేదికను సభముందుంచింది. రోజా విషయంలో కఠినంగానే వ్యవహరించాలని కమిటీ సూచించింది. రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేయాలని సిపార్సు చేసింది. ఎమ్మెల్యే అలవెన్స్‌లు కూడా నిలిపివేయాలని ప్రతిపాదించింది. కొడాలి నానిపైనా చర్యలు తీసుకోవాలని సభకు కమిటీ సిపార్సు చేసింది. జ్యోతుల నెహ్రు, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి క్షమాపణలు చెప్పినందున మందలించి వదిలేయాలని సూచించింది.

కొడాలి నాని కూడా క్షమాపణ చెప్పినప్పటికీ కమిటీ చర్యలకే సిపార్సు చేసింది. నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా రోజా స్పందించలేదని కమిటి అభ్యంతరం వ్యక్తం చేసింది. అనితపై వ్యాఖ్యలకు గాను రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటి సిపార్సు చేసింది. సాకులు చెప్పి కమిటీ ముందు హాజరుకాకుండా రోజా తప్పించుకుందని కమిటీ అభిప్రాయపడింది. రోజాపై ఏడాది సస్పెన్షన్ పైనే రచ్చ జరుగుతున్న వేళ ఆమె అలవెన్స్ లు కూడా ఇవ్వకూడదని కమిటీ సిపార్సు చేయడం చర్చనీయాంశమైంది.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News