ఏం... పిచ్చిపిచ్చిగా ఉందా...

 చంద్రబాబు మరోసారి ప్రభుత్వ అధికారులపై మండిపడ్డారు. ఇంతకు ముందు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సాగునీటి శాఖ ఫైళ్లను తిరస్కరించడంపై ఆగ్రహించిన బాబు, ఈసారి ఆర్థిక శాఖ అధికారిపై ఉరిమారు.. బడ్జెట్‌లో కేటాయింపులు లేని బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా ఎలా మంజూరు చేస్తామని బాబు దగ్గర సదరు అధికారి  అన్నారట. అంతే బాబు ఒక్కసారిగా అధికారిపై విరుచుకుపడ్డారు. ‘‘ఏం.. పిచ్చిపిచ్చిగా ఉందా? తమాషాలు చేస్తున్నారా? ప్రతి ఫైల్‌లో ఇష్టానుసారంగా రాస్తే ఎలా.. ఇలాగైతే పరిపాలన ఎలా ముందుకు సాగించాలి?’’ […]

Advertisement
Update: 2016-03-21 04:16 GMT

చంద్రబాబు మరోసారి ప్రభుత్వ అధికారులపై మండిపడ్డారు. ఇంతకు ముందు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సాగునీటి శాఖ ఫైళ్లను తిరస్కరించడంపై ఆగ్రహించిన బాబు, ఈసారి ఆర్థిక శాఖ అధికారిపై ఉరిమారు.. బడ్జెట్‌లో కేటాయింపులు లేని బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా ఎలా మంజూరు చేస్తామని బాబు దగ్గర సదరు అధికారి అన్నారట. అంతే బాబు ఒక్కసారిగా అధికారిపై విరుచుకుపడ్డారు. ‘‘ఏం.. పిచ్చిపిచ్చిగా ఉందా? తమాషాలు చేస్తున్నారా? ప్రతి ఫైల్‌లో ఇష్టానుసారంగా రాస్తే ఎలా.. ఇలాగైతే పరిపాలన ఎలా ముందుకు సాగించాలి?’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారిపై విరుచుకుపడ్డారు.

బాబు నిర్ణయాలతో అధికారులు విబేధించడం ఇది తొలిసారి కాదు. పోలవరం, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల ఫైళ్లకు ఇద్దరు సీఎస్‌లు మొన్నీ మధ్య అడ్డుతగిలారు. ఆ సమయంలో వారిపై చంద్రబాబు రుసరుసలాడారని వార్తలొచ్చాయి. ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో నీటి ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులను ఈ లోపే పొందేలా కాంట్రాక్టర్లు సీఎంపై ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. . బిల్లులు మంజూరు చేస్తేనే ఎవరి వాటా వాళ్లకి అందుతాయని కాంట్రాక్టర్లు ముఖ్యనేతలకు చెప్పినట్టు సమాచారం. దీంతో బిల్లుల చెల్లింపులో నిబంధనలను ఫాలో అవుతున్న సదరు అధికారిని చంద్రబాబు పిలిపించుకున్నారని సమాచారం. అలా కార్యాలయానికి వచ్చిన అధికారిపై తిట్లదండకం మొదలుపెట్టారట. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిధులు మంజూరు చేయలేమని, రూల్స్ పాలో అయినందుకు తమపై ఆగ్రహం చేయడం ఏమిటని అధికారులు వాపోతున్నారు.

Click on Image to Read:

Advertisement

Similar News